రామ్ పోతినేనికి స్టార్ హీరో అయ్యే అన్ని ఫీచర్స్ ఉన్నా.. ఎందుకో రామ్ మాత్రం ఇంకా ఏవరేజ్ హీరోగానే మిగిలిపోయాడు. అయితే, ‘ఇస్మార్ట్ శంకర్’తో తన మార్కెట్ పరిధిని పెంచుకున్న రామ్, తెలివిగా తమిళ మార్కెట్ పై దృష్టి పెడుతున్నాడు. అందుకే ఇప్పుడు తమిళ దర్శకులతో వరుసగా సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు ఈ ఎనర్జిటిక్ స్టార్.
తమిళ ఇండస్ట్రీలో కూడా దర్శకులు ఎక్కువైపోవడంతో కొంతమంది ఖాళీగా ఉన్నారు. స్టార్ డమ్ అండ్ టాలెంట్ ఉన్న డైరెక్టర్లను అప్రోచ్ అవుతున్నాడు రామ్. ఇప్పటికే లింగుస్వామి డైరెక్షన్ లో ఓ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఈ యాక్షన్ డ్రామా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెలలో మొదలు కానుంది. పైగా ఈ సినిమాలో హీరోయిన్ కీర్తి శెట్టి.
అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఇందులో కీలక పాత్రలో నటించనుంది. ఇక ‘గజిని’, ‘స్టాలిన్’, ‘తుపాకి’ వంటి పెద్ద సినిమాలు తీసిన స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తో కూడా రామ్ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రామ్ ని మురుగదాస్ కలిసి ఒక స్టోరీ లైన్ కూడా చెప్పారని.. రామ్ కి కూడా ఆ లైన్ బాగా నచ్చిందని తెలుస్తోంది.
ఏది ఏమైనా మురుగదాస్ తనంతట తానే చెన్నై నుంచి హైదరాబాద్ రావడం వచ్చి కథ చెప్పడం విశేషమే. అయితే ఈ కాంబినేషన్ పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మొత్తానికి రామ్ తమిళ డైరెక్టర్స్ తో వరుసగా సినిమాలు చేస్తున్నాడు.