కృతి శెట్టితో రొమాన్స్.. దర్శకుడి హడావిడి !

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో తమిళ దర్శకుడు లింగుస్వామి చేయబోతున్న సినిమా షూటింగ్ ఈ రోజు హైదరాబాద్ లో గ్రాండ్ గా మొదలైంది. ముందుగా ఒక సాంగ్ తో ఈ షూట్ స్టార్ట్ చేస్తున్నారని, కృతి శెట్టితో రామ్ రొమాన్స్, అండ్ మాస్ స్టెప్స్ ఈ సాంగ్ లో హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ గురించి తెలియజేస్తూ చిత్రబృందం తాజాగా ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. అయితే, ఇలా […]

Written By: admin, Updated On : July 12, 2021 2:57 pm
Follow us on

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో తమిళ దర్శకుడు లింగుస్వామి చేయబోతున్న సినిమా షూటింగ్ ఈ రోజు హైదరాబాద్ లో గ్రాండ్ గా మొదలైంది. ముందుగా ఒక సాంగ్ తో ఈ షూట్ స్టార్ట్ చేస్తున్నారని, కృతి శెట్టితో రామ్ రొమాన్స్, అండ్ మాస్ స్టెప్స్ ఈ సాంగ్ లో హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ గురించి తెలియజేస్తూ చిత్రబృందం తాజాగా ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది.

అయితే, ఇలా షూటింగ్ గురించి కూడా పోస్టర్ రిలీజ్ చేయాలా అంటే ? దర్శకుడు లింగుస్వామి సంతృప్తి కోసం. రామ్ తో లింగుస్వామి చేస్తున్న ఈ సినిమాని ఎలాగైనా ఆపాలని తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా కాస్త గట్టి ప్రయత్నాలే చేసాడు. కానీ అవేవి ఫలించలేదు. జ్ఞానవేల్ రాజా పై కోపంతోనే లింగుస్వామి ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అప్ డేట్ కి ఇలా భారీ హడావిడి చేస్తున్నాడు.

ఇంతకీ ఈ తమిళ దర్శకుడు ఓన్లీ హడావిడికే పరిమితం అవుతాడా ? లేక హిట్ కూడా ఏమైనా అందిస్తాడా అన్నది చూడాలి. ఈ సినిమా షూటింగ్ కోసం రామ్ మాత్రం బాగా సపోర్ట్ చేశాడు. అలాగే హీరోయిన్ కృతి శెట్టి కూడా ఈ సినిమా కోసం బోల్డ్ గా కనిపించడానికి అంగీకరించింది. ఆమె ఈ సినిమాలో ఫుల్ గ్లామరస్ గా కనిపించనుంది. కాబట్టి, కృతి గ్లామర్ ఈ సినిమాకి బాగా ప్లస్ అవుతుంది.

పైగా సంచలన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి పాటలను స్వర పరుస్తున్నాడు. ఇప్పటికే పాటల్లో మూడు ట్యూన్స్ కూడా ఫైనల్ అయ్యాయి. రామ్ – దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో గతంలో మ్యూజిక్ పరంగా సూపర్ హిట్స్ ఉన్నాయి. అందుకే వీరి కలయిక పై మంచి బజ్ ఉంది. ఇక తెలుగు, తమిళం రెండు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రం పై రెండు భాషల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి.