రామ్ బర్త్ డే గిప్ట్.. ‘డించుక్’ సాంగ్ రిలీజ్

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పుట్టిన రోజును పురస్కరించుకొని రెడ్ చిత్రబృందం అభిమానులకు ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. రెడ్ మూవీ నుంచి ఓ మాస్ బీస్ సాంగ్ రిలీజ్ చేసింది. ‘డించుక్.. డించుక్.. డించా’ అనే సాంగ్లో రామ్ అదిరిపోయే స్టెప్పులతో అలరించాడు. ఈ సాంగ్లో హెబ్బాపటేల్ రామ్ సరసన కన్పించి అలరించింది. ఈ మాస్ బీట్ లో వీరిద్దరు అదిరిపోయే స్టెప్పులతో అభిమానులతో ఆకట్టుకున్నారు. ఈ పాటను కాసర్ల శ్యామ్ రాయగా సాకేత్, […]

Written By: Neelambaram, Updated On : May 15, 2020 12:43 pm
Follow us on

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పుట్టిన రోజును పురస్కరించుకొని రెడ్ చిత్రబృందం అభిమానులకు ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. రెడ్ మూవీ నుంచి ఓ మాస్ బీస్ సాంగ్ రిలీజ్ చేసింది. ‘డించుక్.. డించుక్.. డించా’ అనే సాంగ్లో రామ్ అదిరిపోయే స్టెప్పులతో అలరించాడు. ఈ సాంగ్లో హెబ్బాపటేల్ రామ్ సరసన కన్పించి అలరించింది. ఈ మాస్ బీట్ లో వీరిద్దరు అదిరిపోయే స్టెప్పులతో అభిమానులతో ఆకట్టుకున్నారు. ఈ పాటను కాసర్ల శ్యామ్ రాయగా సాకేత్, కీర్తనా శర్మ గానం అందించగా మ్యూజికల్ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించాడు.

రామ్ తొలిసారి ‘రెడ్’ మూవీలో డబుల్ రోల్ చేస్తున్నాడు. రామ్ సరసన మాళవిక శర్మ, అమృత అయ్యర్, నివేథా పేతురాజ్ నటిస్తున్నారు. ఇటీవలే ఇటలీలో మాళవిక శర్మ-రామ్ లపై పాటల చిత్రీకరణ చేశారు. ఇటలీలోని అద్భుతమైన లోకేషన్లలో షూటింగ్ చేశారు. తదనంతరం కరోనా ఎఫెక్ట్ తో సినిమా షూటింగ్ వాయిదా పడింది. రెడ్ చిత్రానికి కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వహిస్తుండగా స్ర‌వంతి ర‌వికిషోర్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 9న ‘రెడ్’ మూవీని విడుద‌ల చేయాల‌నుకున్న లాక్డౌన్ వాయిదా పడింది. థియేటర్లు తెరుచుకున్నాకే ఈ మూవీ విడుదలపై ఓ క్లారిటీ రానుంది.

రామ్ ఈ మూవీతోపాటు శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ మూవీ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘రెడీ’ మూవీకి రానున్న సీక్వెల్లో రామ్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పూరి జగన్మాథ్-రామ్ కాంబో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ భారీ విజయం సాధించింది. టాలీవుడ్లో ఎనర్జిటిక్ స్టార్ గా దూసుకెళుతున్న రామ్ మరిన్ని విజయాలు అందుకోవాలని ‘Oktelugu’ టీం తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.