Ram Pothineni: ప్రముఖ దర్శకుడు YVS చౌదరి గారు తెరకెక్కించిన దేవదాసు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా రామ్ అప్పట్లో తన తొలి సినిమాతోనే ఎలాంటి ప్రభంజనం సృష్టించాడో మన అందరికి తెలిసిందే..ఈ సినిమాతో ఆయన యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు..ఆ తర్వాత యూత్ తో పాటు ఫామిలీ ఆడియన్స్ దగ్గరయ్యే సినిమాలు చేస్తూ భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన రామ్ మధ్య మధ్యలో మాస్ మసాలా మూవీస్ కూడా చేసాడు..లేటెస్ట్ గా ఆయన పూర్తి జగన్నాథ్ తో తీసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ స్థాయి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఈ సినిమా ద్వారా రామ్ మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు..ఇవన్నీ పక్కన పెడితే హీరో రామ్ గురించి సోషల్ మీడియా లో బయటపడ్డ కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు వైరల్ గా మారాయి..రామ్ టాలీవుడ్ టాప్ నిర్మాత స్రవంతి రవి కిషోర్ కొడుకు అనే విషయం మన అందరికి తెలుసు..కానీ ఆయన చైల్డ్ ఆర్టిస్టుగా ఒక సినిమాలో నటించాడని విషయం మాత్రం చాలా మందికి తెలియదు.

ఇక అసలు విషయానికి వస్తే రామ్ తన మొదటి సినిమా దేవదాస్ చేసే సమయానికి ఆయన వయసు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే..ఈ సినిమాకి ముందు 11 ఏళ్ళ వయస్సులోనే ఒక తమిళ షార్ట్ ఫిలిం లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడట..ఆ సినిమా పేరు ఆదాయలం..అప్పట్లో ఈ సినిమా పెద్ద విజయం సాధించడమే కాకుండా హీరో రామ్ కి ఉత్తమ బాలనటుడిగా పలు అవార్డులు కూడా వచ్చేలా చేసింది..ఈ విషయాన్నీ ఇటీవలే జరిగిన ఒక పర్సనల్ ఇంటర్వ్యూ లో తెలిపాడు రామ్..ఇక ప్రస్తుతం రామ్ ప్రముఖ తమిళ దర్శకుడు లింగు స్వామి తో ‘ది వారియర్’ అనే సినిమా చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా ద్వారా తొలిసారి రామ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు.
Also Read: Pakka Commercial First Day Collections: పక్కా కమర్షియల్ మొదటి రోజు వసూళ్లు

నిన్ననే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చెయ్యగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించగా..ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి ఇందులో హీరోయిన్ గా నటించింది..ఇక ప్రముఖ హీరో ఆది ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు..ఇప్పటికే దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు సెన్సషనల్ హిట్ గా నిలిచి సినిమాకి బజ్ పెంచడం లో బాగా సహాయపడింది..మరి 14 వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది చూడాలి.
Also Read:Rashmika Mandanna: రష్మిక మందన్నా రెడ్ అందాలు.. ఈ పిక్స్ ముందు ఏంజెల్ కూడా తక్కువే
[…] Also Read: Ram Pothineni: హీరో రామ్ బాలనటుడిగా నటించిన సి… […]