Vyuham Teaser: గత కొంతకాలం క్రితం రామ్ గోపాల్ వర్మ ప్రస్తుత రాజకీయాల మీద ‘వ్యూహం’ అనే సినిమా చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇది స్వయంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తన వైసీపీ పార్టీ కోసం చేయించుకుంటున్న సినిమా. ఇది వరకే రెండు మూడు సార్లు ఈ చిత్రం కోసం రామ్ గోపాల్ వర్మ ముఖ్యమంత్రిని కలిసాడు. ఇక ఈరోజు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చేసాడు.
ఈ టీజర్ లో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత నుండి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాల దగ్గర నుండి ఈ చిత్రం ప్రారంభం అవ్వబోతున్నట్టు టీజర్ లో చూపించాడు. తన రూమ్ లో వ్యాయామం చేసుకుంటున్న జగన్ కి అకస్మాత్తుగా తండ్రి చనిపోయినట్టు వార్త వినిపిస్తుంది. ఆ తర్వాత ఆయన ఓదార్పు యాత్ర చెయ్యడం వంటివి చూపిస్తారు.
ఆ తర్వాత ఆయన మీద కేసులు పెట్టి జైలుకి పంపడం వంటివి కూడా చూపిస్తారు. ఇక ఈ టీజర్ లో చంద్రబాబు నాయుడు పాత్రదారి ఎవరో కానీ అచ్చు గుద్దినట్టుగా చంద్ర బాబు పోలికలతో ఉన్నాడు. మామూలుగా వివాదాస్పద బియోపిక్స్ తీస్తున్నప్పుడు ఎవరైనా సదరు వ్యక్తికీ సంబంధించిన ఒరిజినల్ పేర్లను బయటకి చెప్పరు, వేరే ఏదైనా పేరుతో పిలుస్తారు. కానీ ఈ టీజర్ లో మాత్రం డైరెక్ట్ అటాక్ చేసాడు రామ్ గోపాల్ వర్మ.
టీజర్ చివర్లో ‘అలా చెయ్యడానికి నేను చంద్ర బాబుని కాదు’ అంటూ జగన్ పాత్రదారి చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా నిల్చింది. దీనిపై ఒక రేంజ్ లో గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ టీజర్ లో ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ కనిపించకపోవడం విశేషం. అసలు ఆయన పాత్ర ఈ సినిమాలో ఉంటుందా, లేదా పార్ట్ 2 లో ఏమైనా ప్లాన్ చేసారా అనేది చూడాలి.