కరోనాకు వార్నింగ్ ఇస్తున్న ఆర్జీవీ

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్శ తన దైన శైలిలో కరోనా వైరస్ పై స్పందించాడు. ‘డియర్ కరోనా వైరస్ అంటూ మొదలెట్టిన రాంగోపాల్ వర్శ.. ఏకంగా వార్నింగ్ ఇచ్చినంత పని చేశాడు. ‘మూగదానిలా అందరినీ చంపుకుంటూ పోతున్న డియర్ కరోనా నువ్వొక విషయం గుర్తించుకో.. నీవు ఒక పరాన్నజీవివి. మాతోపాటే నీవు కూడా చస్తావ్.. నీవు నా మాటలను నమ్మకపోతే.. వైరాలజీలో ఒక క్రాష్ కోర్సు తీసుకో.. నీకు ఇదే నా విన్నపం.. నువ్వు బ్రతుకు.. అందరినీ […]

Written By: Neelambaram, Updated On : March 5, 2020 10:25 am
Follow us on

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్శ తన దైన శైలిలో కరోనా వైరస్ పై స్పందించాడు. ‘డియర్ కరోనా వైరస్ అంటూ మొదలెట్టిన రాంగోపాల్ వర్శ.. ఏకంగా వార్నింగ్ ఇచ్చినంత పని చేశాడు. ‘మూగదానిలా అందరినీ చంపుకుంటూ పోతున్న డియర్ కరోనా నువ్వొక విషయం గుర్తించుకో.. నీవు ఒక పరాన్నజీవివి. మాతోపాటే నీవు కూడా చస్తావ్.. నీవు నా మాటలను నమ్మకపోతే.. వైరాలజీలో ఒక క్రాష్ కోర్సు తీసుకో.. నీకు ఇదే నా విన్నపం.. నువ్వు బ్రతుకు.. అందరినీ బతికించు.. నీకు జ్ఞానం కలుగుతుందని ఆశిస్తున్నా’ అంటూ ట్వీట్‌ చేశాడు. ఈ సెటైరికల్ ట్వీట్ ప్రస్తుతం వైరల్గా మారింది.

కాగా కొందరు సెలబెట్రీలు కరోనాపై కుళ్లు జోకులేస్తూ విమర్శలపాలవుతోన్నారు. తాజాగా కరోనాకు వెల్‌కమ్‌ అని చార్మి నిన్న టిక్‌టాక్‌ చేయగా నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెటిజన్లు ఆమెను ట్రోల్ చేయడంతో వెంటనే ఆ వీడియోను తొలగించింది. చివరి చార్మి చెప్పాల్సి వచ్చింది. అయితే కరోనా ప్రభావంతో ప్రజలు భయాందోళన చెందుతుంటే కొందరు వ్యాపారులు మాత్రం సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. మెడికల్ షాప్‌ల యజమానులు మాస్క్‌ల ధరలను రూ.5 నుంచి ఏకంగా రూ.40కి పెంచారు. అయినప్పటికీ మెడికల్ షాపులకు మాస్కుల కోసం ప్రజలు క్యూ కడుతున్నారు. అయినప్పటికీ మాస్కులు దొరకని పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ప్రతీఒక్కరికి ఉచితంగా మాస్కులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.