RGV Vyuham Teaser 2: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యూహం చిత్రం ప్రకటించినప్పటి నుండి రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ ని నేరుగా కలిసిన రామ్ గోపాల్ వర్మ వ్యూహం టైటిల్ తో మూవీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇది వైఎస్ జగన్ బయోపిక్ అంటూ ప్రచారం జరిగింది. తరచుగా వ్యూహం వర్కింగ్ స్టిల్స్ విడుదల చేస్తూ వర్మ మరింత కాకరేపాడు. వ్యూహం మూవీలో అతడు ఏం చెప్పబోతున్నాడో హింట్ ఇచ్చాడు. చెప్పాలంటే వ్యూహం మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణం అనంతరం సంభవించిన పరిస్థితుల సమాహారం.
2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే నెలల వ్యవధిలో ఆయన ప్రమాదంలో కన్నుమూశారు. రాజశేఖర్ రెడ్డి మరణంతో ఏపీ సీఎం పీఠం ఎవరిదనే చర్చ నడిచింది. తర్వాత వైఎస్ జగన్ అధిష్ఠానానికి వ్యతిరేకంగా ఓదార్పు యాత్ర చేయడం. సీబీఐ కేసులు, జైలుకు వెళ్లడం జరిగింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ కి ఎదురైనా ఇబ్బందులను వ్యూహం మూవీలో వర్మ చూపించబోతున్నాడు.
అలాగే జగన్ పై సీబీఐ దాడులు, కేసులు వెనుక కాంగ్రెస్ అధిష్టానంతో పాటు నారా చంద్రబాబు నాయుడు ఉన్నాడనే కోణంలో వ్యూహం తెరకెక్కింది. నేడు విడుదలైన వ్యూహం టీజర్ 2 చూస్తే వర్మ ఈ చిత్రం ద్వారా చాలా మందిని బ్లేమ్ చేయబోతున్నాడని తెలుస్తుంది. టీజర్ లో సోనియా గాంధీ, రోశయ్య, చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్, చంద్రబాబు నాయుడు రిఫరెన్స్లు ఉన్నాయి.
వీరితో జగన్ కొన్ని సందర్భాల్లో భేటీ అయ్యారనట్లు చెప్పారు. మొత్తంగా జగన్ ని ఇబ్బంది పెట్టిన వారి లిస్ట్ లో కాంగ్రెస్ అధిష్టానంతో పాటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, చిరంజీవి కూడా ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. మరో పది నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. వైఎస్ జగన్ కి పొలిటికల్ గా మైలేజ్ ఇచ్చేందుకే వ్యూహం తెరకెక్కింది. వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం మూవీలో జగన్ రోల్ రంగం ఫేమ్ అజ్మల్ అమీర్ చేశారు.
https://www.youtube.com/watch?v=FRCPl_iVkY4