Ram Gopal Varma tweet: రీసెంట్ గా నటుడు శివాజీ(Actor Sivaji) ‘దండోరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్స్ ధరించే దుస్తులపై చేసిన కామెంట్స్ అనేక వివాదాలకు దారి తీసి, రోజురోజుకి వేడి తారాస్థాయికి చేరుకుంటుంది. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. శివాజీ ఏమి తప్పు మాట్లాడాడు?, ఎందుకు ఆయన్ని సెలబ్రిటీలు అంత టార్గెట్ చేస్తున్నారు అంటూ నెటిజెన్స్ నుండి శివాజీ కి విపరీతమైన మద్దతు లభిస్తోంది. శాసన సభ్యుడు అయ్యుండి, సినీ ఇండస్ట్రీ లో అగ్ర హీరో గా కొనసాగుతూ వచ్చిన నందమూరి బాలకృష్ణ, పబ్లిక్ ఈవెంట్ లో ‘ఆడపిల్ల కనిపిస్తే ముద్దు అయినా పెట్టాలి..లేదా రే** చెయ్యాలి’ అంటూ మాట్లాడితే ఒక్క సినీ సెలబ్రిటీ కూడా స్పందించలేదు. అలాంటిది పద్దతిగా ఉండండి అమ్మా, మృగాళ్లకు అవకాశాలు ఇవ్వొద్దు వంటి మంచి మాటలు చెప్పిన శివాజీ ఇప్పుడు దొంగ లాగా కనిపిస్తున్నాడా అందరికీ?, ఇదెక్కడి న్యాయం?.
కాసేపటి క్రితమే శాసనమండలి సభ్యుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా ఈ విషయం పై స్పందిస్తూ 14 నిమిషాల నిడివి ఉన్న వీడియో ని అప్లోడ్ చేసాడు. ఆ వీడియో లో ఆయన్ని శివాజీ ని ఒక రేంజ్ లో తప్పుబట్టారు, ఆవేశం తో ఊగిపోయాడు. ఇంత ఆవేశం బాలకృష్ణ మాట్లాడిన రోజుల్లో ఏమైంది?, నాగబాబు స్పందించలేదే?, ఇప్పుడే ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నాగబాబు సంగతి పక్కన పెడితే, రామ్ గోపాల్ వర్మ కూడా శివాజి వ్యాఖ్యలపై గత రెండు రోజుల నుండి నిప్పులు తొక్కుతున్నాడు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు, ఆడబిడ్డలతో బ్లూ ఫిలిమ్స్ తీసుకునే స్థాయికి పడిపోయిన రామ్ గోపాల్ వర్మ కి శివాజీ ని విమర్శించే అర్హత ఉందా చెప్పండి? అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
కాసేపటి క్రితమే ఆయన శివాజీ ని ఒక రేపిస్ట్ తో పోలుస్తూ వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనం గా మారింది. ‘హీరోయిన్స్ పురుషులను రెచ్చగొట్టే బట్టలు వేసుకోకూడదు’ అంటూ చేసిన వ్యాఖ్యలను, గతం లో నిర్భయ కేసు లో రేపిస్ట్ చేసిన వ్యాఖ్యలతో పోల్చాడు. ఆ రేపిస్ట్ ఏమి మాట్లాడాడంటే ‘మంచి అమ్మాయి రోడ్డు మీద రాత్రి 9 గంటల తర్వాత తిరగదు. రేప్ కేసుల్లో ఆడవాళ్లదే ఎక్కువ తప్పు ఉంటుంది’ అని అంటాడు. అతను చేసిన వ్యాఖ్యలకు, శివాజీ చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి తేడా లేదు అంటూ రామ్ గోపాల్ వర్మ మరోసారి నిప్పులు చెరిగాడు. ఆయన వేసిన ట్వీట్ ని మీరు కూడా చూసేయండి.
This says it all https://t.co/NK7i8ipiHb
— Ram Gopal Varma (@RGVzoomin) December 27, 2025