Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ… శివ సినిమాతో తెలుగుతెరపై ఓ ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు. తన సినిమాల కంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు ఈ దర్శకుడు. అయితే దర్శకుడిగా మాత్రమే కాకుండా కాంట్రవర్సీలకు కేరాఫ్ గా నిలిచి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుండడం ఆర్జీవికి అలవాటు అని చెప్పాలి. తన సినిమాలకు వినూత్న రీతిలో పబ్లిసిటీ చేసుకోవడంలో ఆయనకు మించిన ఘణాపాటి ఇంకొకరు లేరు అంటే అది అతిశయోక్తి కాదనే చెప్పాలి.
ఓటిటీలో వెబ్ సిరీస్ రూపొందించడంలో ఆయన స్టైలే వేరు. ఇంక బయోపిక్ సినిమాల నిర్మాణంలో రాంగోపాల్ వర్మ టేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఎప్పుడు ఏదో ఓ విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రెండింగ్ లో ఉండే ఆర్జీవి… రాజకీయ నాయకులు, సినీ తారలపై కూడా కామెంట్లు చేస్తూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు.
కాగా డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఎన్సీబి విచారణలో భాగంగా ఇన్ని రోజులు కస్టడీలో ఉన్న ఆర్యన్… ఈరోజే బెయిల్ పై ముంబై లోని జైలు నుంచి విడుదల అయ్యాడు. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ జైలు నుంచి విడుదల కావడం పై రాం గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్ చేశారు. ” బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రతీ దీపావళి ఏదో ఒక సినిమాతో ఖాన్స్ వస్తారు. అయితే ఈ సారి మాత్రం ఖాన్ విడుదల అయ్యాడు” అంటూ వర్మ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
In Bollywood, Diwali has always been reserved for a Khans's release.
This Diwali also Khan got released.
— Ram Gopal Varma (@RGVzoomin) October 30, 2021