Ram Gopal Varma- Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన పొలిటికల్ కామెంట్స్ దూమారం రేపాయి. ఆయన సీఎం రేసులో లేనని నేరుగా చెప్పారు. గత ఎన్నికల్లో జనసేన 30-40 సీట్లు గెలిచి ఉంటే పొత్తుల్లో సీఎం పదవి డిమాండ్ చేసే హక్కు ఉండేది. త్రిముఖ పోటీలో జనసేన పార్టీని బలి చేయలేను. ఖచ్చితంగా పొత్తులు ఉంటాయన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం సీఎం పదవి ఎవరికనేది చర్చిద్దాం అన్నారు. పవన్ వ్యాఖ్యలను ప్రత్యర్ధులు తప్పుదోవ పట్టిస్తున్నారు. సీఎం కావాలని లేని వ్యక్తికి రాజకీయాలు, సొంత పార్టీ ఎందుకు?. పవన్ కళ్యాణ్ కి ప్రజాసేవ చేసే ఉద్దేశం లేదంటూ మాటల దాడికి దిగుతున్నారు.
ఇక పవన్ ప్రత్యర్థుల్లో రామ్ గోపాల్ వర్మ ఒకరు. వైసీపీ పార్టీ మద్దతుదారుడిగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఉంటారు. ఆయన నిర్ణయాలపై సెటైరికల్ పోస్ట్స్ పెడుతుంటారు. తాజాగా రామ్ గోపాల్ వర్మ పవన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్ కళ్యాణ్ CM(ముఖ్యమంత్రి) కావాలనుకోవడం లేదు. ఎందుకంటే ఆయన CM(Confused Person) కావాలనుకుంటున్నారు… అన్నారు.
ఆయన స్పష్టత లేని రాజకీయ నాయకుడు కావాలనుకుంటున్నాడు. అందుకే ముఖ్యమంత్రి కావాలనుకోవడం లేదని వర్మ ట్వీట్ చేశారు. వర్మ ట్వీట్ పై పవన్ అభిమానులు మండిపడుతున్నారు. కామెంట్స్ సెక్షన్ లో వర్మకు కౌంటర్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ అభిమానులు, వర్మ మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తోంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గతంలో కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా సినిమాలు తీశారు.
పవర్ స్టార్ టైటిల్ తో తెరకెక్కించిన సినిమాలో పవన్ ని కించపరిచే సన్నివేశాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత పవన్ కళ్యాణ్ ఇలా ప్రవర్తించారంటూ ఆయన పోలిన వ్యక్తిని హీరోగా పెట్టి సినిమా తీశాడు. ఆ చిత్ర క్లైమాక్స్ లో వర్మ పవన్ కళ్యాణ్ కి హిత బోధ చేయడం విశేషం. పవన్ కాళ్ళ వద్ద కూర్చొని పవన్ పొలిటికల్ వైఫల్యాల మీద రివ్యూ పెట్టాడు. సినిమా మొత్తం వర్మ మీద కోపం తెప్పించినా క్లైమాక్స్ మాత్రం ఫ్యాన్స్ సంతృప్తి పడేలా ఉంటుంది.