https://oktelugu.com/

Ram Gopal Verma : యానిమల్ మూవీలో రాంగోపాల్ వర్మ వెతికిన అతి పెద్ద లాజిక్ ఏంటో తెలుసా?

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా, అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటించిన యానిమల్ (Animal), విడుదలైనప్పటి నుంచీ సినిమా లవర్స్, క్రిటిక్స్, బాక్సాఫీస్ ట్రాకర్స్ అందరినీ ఆశ్చర్యపరిచింది.

Written By: , Updated On : February 6, 2025 / 09:23 AM IST
Ram Gopal Verma

Ram Gopal Verma

Follow us on

Ram Gopal Verma : సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా, అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటించిన యానిమల్ (Animal), విడుదలైనప్పటి నుంచీ సినిమా లవర్స్, క్రిటిక్స్, బాక్సాఫీస్ ట్రాకర్స్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా కలెక్షన్ల పరంగా బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది. భారతీయ సినిమా మేకింగ్‌ స్టైల్‌ను కొత్త కోణంలో ఆలోచించేలా చేసింది.

సినిమాలతోనే కాదు.. సోషల్ మీడియాలో తన ఘాటైన వ్యాఖ్యలతో కూడా తరచూ వార్తల్లో నిలిచే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తాజాగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ గురించి ఓ సంచలన రివ్యూకిచ్చారు. ఈ సినిమా కేవలం సినిమా మాత్రమే కాదు.. ఒక సోషల్ స్టేట్‌మెంట్ అని ఆయన పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. “నాకు యానిమల్ కథ, తండ్రి-కొడుకు ఎమోషన్ అంతగా రాలేదు. కానీ, అలాంటి కథని కూడా ‘సందీప్ వంగా’ చాలా రఫ్, రగ్డ్ మేకింగ్‌తో బ్రూటల్‌గా తెరకెక్కించాడు. సినిమా అంటే ఇలా తీయాలి అని అనుకునే ప్రతి దర్శకుడికి ఈ సినిమా ఓ ఎలక్ట్రిక్ షాక్!. సంప్రదాయ నైతిక విలువలన్నింటినీ తన డైరెక్షన్‌తో ఊడ్చి, గోడకేసి కొట్టినట్టున్నారు సందీప్!”అని అన్నారు.

సినిమాలో షాకింగ్ మోమెంట్స్:
సినిమా చాలా స్లోగా సాగినా, ఒక్కోసారి మనం షాక్ అవుతాం. అసలు స్లోగా ఉండటం వల్లే అటువంటి షాకింగ్ మోమెంట్స్ ఇంకా ఎక్కువ ఫీలవుతాయన్నారు. నాకు ఏదో హీరో ఒక బేస్ బాల్ బ్యాట్ పట్టుకుని వస్తాడేమో అనిపించింది. కానీ అతడు మిషీన్ గన్ పట్టుకుని రావడం థియేటర్‌లోని అందరినీ కుర్చీల్లోంచి కింద పడేలా చేసిందన్నారు. ఇంటర్వెల్ ఫైట్‌లో పాట వాడిన తీరు.. మైకేల్ జాక్సన్ ‘బీట్ ఇట్’ మ్యూజిక్ వీడియోను గుర్తు తెచ్చిందన్నారు.

బాబీ డియోల్ ఇంట్రడక్షన్ – సినిమా చరిత్రలో ఓ మైలురాయి!
“ఈ సినిమాలో విలన్‌ పాత్రలో బాబీ డియోల్ ఎంట్రీ ఇప్పటివరకు ఎవ్వరూ ఊహించనటువంటి విధంగా ఉంది. స్ప్లిట్ స్క్రీన్ ఎఫెక్ట్‌తో అతన్ని ఓ పెళ్లికూతురు మేని ముసుగు తీసినట్టుగా చూపించడం – జస్ట్ జీనియస్! అని ఆయన మెచ్చుకున్నారు.

రణ్‌బీర్‌పై వర్మ మాటలు!
ట్రైలర్ చూసినప్పటి నుంచి రణ్‌బీర్ కాస్త ఓవర్ యాక్ట్ చేస్తున్నాడేమో అనిపించింది. కానీ సినిమా చూస్తే పూర్తిగా షాక్ అయ్యా అన్నారు. ఈ క్యారెక్టర్ రణ్‌బీర్‌ని మోస్తుందా? లేక రణ్‌బీర్ ఈ క్యారెక్టర్‌ని మోస్తాడా? అన్న డైలమాలో పడిపోయా అన్నారు. 1913లో రాజా హరిశ్చంద్ర వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ (110 ఏళ్లలో) ఏ నటుడూ రణ్‌బీర్ లాంటి కన్సిస్టెన్సీ చూపించలేదన్నారు.ఇక నుంచి బాలీవుడ్, టాలీవుడ్‌లో ఏ సినిమా ఆఫీస్‌లో చూసినా.. ‘యానిమల్’ అక్కడ వెంటాడుతుందన్నారు. అందరూ ఈ సినిమా ఎఫెక్ట్ నుంచి బయటపడాలంటే చాలా టైం పడుతుందని ఆర్జీవీ అన్నారు.

సినిమా మేకింగ్, రూల్స్ అన్నీ బ్రేక్ చేస్తూ సందీప్ వంగా ఓ కొత్త ట్రెండ్ సెట్ చేశాడు.అది కొంత ప్రమాదకరం అన్నారు. ఇష్టం వచ్చినట్లు తీస్తే ఫ్లాప్ పర్సంటేజ్ ఇప్పుడున్న 90శాతం నుంచి 110శాతానికి పెరుగుతుందన్నారు. రాంగోపాల్ వర్మ ఇలా ‘యానిమల్’ సినిమాపై ఇచ్చిన కాంప్లిమెంట్స్, విమర్శలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సందీప్ రెడ్డి వంగా సినిమాపై వేసిన మార్క్ ఇండస్ట్రీలో ఎంత వరకు ప్రభావం చూపుతుందో చూడాలి.

Animal vs Wild Animal: A Legendary Conversation with RGV&Sandeep Reddy Vanga🐾🔥#shortvideo #trending