Homeఎంటర్టైన్మెంట్RGV: హన్మకొండలో రామ్​గోపాల్​ వర్మ ర్యాలీ!

RGV: హన్మకొండలో రామ్​గోపాల్​ వర్మ ర్యాలీ!

RGV: విభిన్న చిత్రాలతో సంచలనం సృష్టిస్తూ.. ఎప్పుడూ వివాదాల్లో నిలిచే దర్శకుడు రామ్​గోపాల్​ వర్మ. ఈ క్రమంలోనే ప్రస్తుతం కొండా అనే సినిమాను రూపొందిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో తమకంటూ ఓ గుర్తింపు పొందిన కొండా దంపతుల కథాంశం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు రామ్​గోపాల్​ వర్మ. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్​ విడుదల చేసి మరింత హీట్​ను పెంచారు.

ram-gopal-varma-held-rally-in-hanumakonda

మరోవైపు తాజాగా, హన్మకొండలో కొండా చిత్రబృందం పర్యటించింది. ఈ సందర్భంగా హన్మకొండలో వర్మకు కొండా సురేఖ దంపతులు ఘన స్వాగతం పలికారు. కొండా సురేఖ ఇంటికి వెళ్లిన రామ్​గోపాల్​.. అనంతరం ర్యాలీ నిర్వహించారు. వరంగల్​ నుంచి వంచనిగిరి వరకు ఈ ర్యాలీ కొనసాగింది. సినిమా షూటింగ్​ నేపథ్యంలో వర్మ హన్మకొండకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఎప్పుడూ ఏదో ఒక పని చేసి వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ … ఇప్పుడు కూడా అందుకే ఈ ర్యాలీ నిర్వహించాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సినిమా ప్రమోషన్లు చేసుకోవడంలో వర్మ కు సాటి ఎవరూ రారు అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.  రక్తచరిత్ర ఘన విజయం సాధించిన రీతిలోనే ఈ మూవీ కూడా హిట్ కావాలని ఆర్‌జి‌వి అభిమానులు కోరుకుంటున్నారు.

మరోవైపు డేంజరస్​ సినిమా తెరకెక్కిస్తోన్న రామ్​గోపాల్​… దీనికి సంబంధించిన ట్రైలర్​ను విడుదల చేశారు. ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమతో పాటు, క్రైమ్​ థ్రిల్లర్​ నేపథ్యంలో ఈ సినమా సాగనుంది. దీంతో పాటు ఎంటర్​ ది గర్ల్​ డ్రాగన్​, D కంపెనీ ( వెబ్​ సిరీస్​) వంటి వరుస చిత్రాలతో మునిగిపోయారు వర్మ. ఇంత బిజీ షెడ్యూల్​లోనూ తనదైన శైలిలో ట్విట్టర్​ వేదికగా పలు అంశాలపై స్పందిస్తూ హాట్​ టాపిక్​గా నిలుస్తుంటారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version