https://oktelugu.com/

Ramgopal Varma : వర్మ కంట్లో పడ్డ ఈ సుందరాంగి ఎవరు..? ఒక్క వీడియోతో పిచ్చ ఫేమస్!

అషురెడ్డి, అరియనా గ్లోరీలతో బోల్డ్ ఇంటర్వ్యూలు చేసి ఫేమ్ తెచ్చిపెట్టాడు. ఇనాయ సుల్తానా సైతం వర్మ కారణంగానే పాపులర్ అయ్యింది.

Written By:
  • NARESH
  • , Updated On : September 27, 2023 / 08:48 PM IST
    Follow us on

    Ramgopal Varma : దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తలచుకుంటే ఎవరినైనా ఓవర్ నైట్ స్టార్ చేస్తాడు. సౌందర్య ఆరాధకుడిగా పేరున్న వర్మ కెరీర్ బిగినింగ్ నుండి ఎందరో అమ్మాయిలకు లైఫ్ ఇచ్చాడు. కొందరిని తిరుగులేని స్టార్స్ చేశాడు. ఫామ్ కోల్పోయాక కూడా ముక్కు ముఖం తెలియని అమ్మాయిలను సోషల్ మీడియాలో పాప్యులర్ చేస్తున్నారు. తన చిత్రాల్లో అవకాశాలు ఇస్తున్నాడు. అప్సర రాణి, నైనా గంగూలీ, అషురెడ్డి, అరియనా గ్లోరీ ఈ కోవలోకే వస్తారు. హీరోయిన్ గా ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయిన అంకితా మహారాణాను అప్సర రాణిగా పాప్యులర్ చేశాడు. వర్మ తెరకెక్కించిన అడల్ట్ కంటెంట్ చిత్రాల్లో ఆమెకు అవకాశాలు ఇచ్చాడు.

    అషురెడ్డి, అరియనా గ్లోరీలతో బోల్డ్ ఇంటర్వ్యూలు చేసి ఫేమ్ తెచ్చిపెట్టాడు. ఇనాయ సుల్తానా సైతం వర్మ కారణంగానే పాపులర్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొనే ఛాన్స్ దక్కించుకుంది. ఇదిలా ఉంటే వర్మ కంట్లో ఓ అమ్మాయి పడింది. ఆమె వివరాలు ఆయనకు తెలియవట. ఆమె వీడియో తన అధికారిక అకౌంట్స్ లో షేర్ చేసి ”ఆమె ఎవరో చెప్పాలని” కామెంట్ చేశాడు.

    ఎల్లో శారీ ధరించి ఆ అమ్మాయి కొంచెం ప్రత్యేకంగా ఉంది. చేతిలో కెమెరాతో నేచర్ ని ఫోటోల రూపంలో బంధిస్తుంది. సహజ సుందరిలా ఉన్న ఆమె లుక్ వర్మను కట్టిపడేసింది. అందుకే ఎవరో తెలుసుకోవాలని ఆశపడ్డాడు. ఎట్టకేలకు ఆమె ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ పట్టేశాడు. ఆ అమ్మాయి పేరు శ్రీలక్ష్మి సతీష్. ఫోటోగ్రఫీ ఇష్టమైన వ్యాపకం అని అర్థం అవుతుంది. అలాగే ఆమె మలయాళీ అమ్మాయని కూడా ప్రొఫైల్ ని బట్టి అవగతమవుతుంది. ఆమె పూర్తి వివరాలు మాత్రం తెలియలేదు.

    వర్మ నేరుగా శ్రీలక్ష్మి సతీష్ ని ట్యాగ్ చేస్తూ ఆఫర్ ఇచ్చేశాడు. నీకు యాక్టింగ్ మీద ఆసక్తి ఉంటే నన్ను సంప్రదించు. నాకు సందేశం పంపు అన్నాడు. మరి దర్శకుడు వర్మ ఆఫర్ ని శ్రీలక్ష్మి సతీష్ యాక్సెప్ట్ చేస్తారో? రిజెక్ట్ చేస్తారో చూడాలి. ఇక వర్మ విషయానికి వస్తే ప్రస్తుతం వ్యూహం టైటిల్ తో పొలిటికల్ థ్రిల్లర్ చేస్తున్నాడు. ఇది వైఎస్ జగన్ బయోపిక్ అని సమాచారం. దీనికి సీక్వెల్ గా శబధం అనే చిత్రం కూడా ఉందట.