Ram Gopal Varma: ప్రస్తుతం పాన్ ఇండియా మూవీస్ ట్రెండ్ నడుస్తోంది. ఇది టాలీవుడ్ నుంచే… అది బాహుబలితోనే స్టార్ట్ అయిందనే చెప్పాలి. ప్రస్తుతం సౌత్ సినిమాలు ఇండయన్ సినిమాపై ప్రభావం చూపుతున్నాయి. ఒకప్పుడు బాలీవుడ్ కి మంచి క్రేజ్ ఉండేది. బిగ్ బీ అమితాబ్.. ఖాన్స్.. కపూర్స్ పేర్లే ఎక్కువగా వినిపించేవి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. రికార్డులు అంటే పాన్ ఇండియా సినిమాలు అదే.. మన సౌత్ ఇండియా సినిమాలే.. తెలుగు, కన్నడ రికార్డులే ఇప్పుడు బాలీవుడ్ కి దిక్కు. ఏ ఖాన్ కూడా ఈ రికార్డ్స్ బద్దలుకొట్టేలా కనిపించడం లేదు. బాలీవుడ్ లో అత్య\ధిక ఓపెనింగ్ వసూళ్లు సాధించిన చిత్రంగా కేజీఎఫ్2 మొదటి స్తానంలో, రెండో స్థానంలో బాహుబలి2 నిలిచిందని చెబుతూ.. రాంగోపాల్ వర్మ హిందీ సినిమాలకు ఏంటీ దుస్థితి అని ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఇదే అందరిని అలోచనలో పడేలా చేస్తోంది.

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి1, బాహుబలి 2 ద కన్ క్లూజన్ సిరీస్లు సంచలనం విజయం సాధించడం కాదు.. ఇండియన్ సినిమాకు కొత్త లెక్కలు చూపించాయి. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఇండియన్ సినిమా సత్తా చూపించింది. ప్రతీ తెలుగోడు కాలర్ ఎగరేసుకునేలా అన్ని ఇండస్ట్రీలలో జెండా పాతేసింది బాహుబలి 2. 2015లో విడుదలైన మొదటి భాగమే 500 కోట్లు వసూలు చేసింది. దీనికే అప్పుడు అందరూ షాక్ అయ్యారు. అలాంటిది రెండేళ్ల తర్వాత వచ్చిన రెండో భాగం ఏకంగా 2000 కోట్ల క్లబ్బులో చేరిపోయింది. తొలిరోజే 120 కోట్లకు పైగా షేర్ తీసుకొచ్చింది. ఇలా కలలో కూడా సాధ్యం కాని ఎన్నో రికార్డులను బాహుబలి సృష్టించింది. ఇది చూసి బాలీవుడ్ కూడా ఉలిక్కిపడింది. ఇప్పటికీ బాలీవడ్ లో బాహుబలి 2 రికార్డుల్ని ఏ ఇందీ చిత్రం అందుకోలేకపోయింది. హిందీలోనే ఓవరాల్ గా 500 కోట్లకు పైగా రాబట్టింది.
Also Read: RRR vs KGF 2 Collections: RRR 3 రోజుల కలెక్షన్స్ ని కేవలం ఒక్క రోజులోనే దాటేసిన KGF చాఫ్టర్2
బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత ఆ స్థాయి భారీ అంచనాలతో వచ్చిన సినిమా కేజీఎఫ్2. మొదటి భాగానికి ఇది కొనసాగింపు. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందించిన కేజీఎఫ్2 సినిమా గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సినిమా ఇప్పటికే ఓవర్సీస్‌లో ప్రదర్శించబడుతోంది. యష్, సంజయ్ దత్, రవీనా టాండన్, మరియు శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. బాలీవుడ్ లో బాహుబలి రికార్డులను సమం చేసింది. కేజీఎఫ్2 కేవలం హిందీ వెర్షన్ యొక్క అడ్వాన్స్ బుకింగ్‌లతోనే తొలిరోజు 31 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇప్పటి వరకు బుధవారం వరకు మొత్తం 4 రోజుల వారాంతానికి అడ్వాన్స్ వసూళ్లు దాదాపు 55 కోట్లు రాబట్టింది.
బాహుబలి తర్వాత స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ పీరియాడిక్ ఫిక్షన్ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు కలిసి నటించగా, ఆలియా భట్, ఒలివియా మారిస్‌లు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. కీరవాణి సంగీతం అందించిన ఈ ప్రెస్టీజియస్ మూవీని డివివి దానయ్య అత్యంత భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేశారు. ఈసినిమా కూడా మంచి రికార్డులను సొంతం చేసుకుంది. ఓవర్సిస్ లో ఓ ఊపు ఊపుతోంది. అయితే హిందిలో బాహుబలి మార్క్ టచ్ చేయలేపోయింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప పాన్ ఇండియా సినిమా గతేడాది డిసెంబర్ 17న విడుదలై నెగిటివ్ టాక్‌తో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా నైజాం లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. పుష్ప హిందీ వెర్షన్ మంచి వసూళ్లనే దక్కించుకుంది. ముఖ్యంగా కేజీఎఫ్ రికార్డును బద్దలు కొట్టింది. ఈ సినిమా ఓవరాల్‌గా రూ. 173 కోట్లకు పైగా షేర్ సాధించింది. గ్రాస్ విషయానికొస్తే.. రూ. 332 కోట్లు వసూళు చేసి సంచలనం సృష్టించింది. ఒక్క హిందీలోనే రూ. 42. 70 కోట్ల షేర్ రాబట్టింది.
ఇలా అన్ని సినిమాలు హిందిలో సత్తా చూపిస్తుంటే మరి బాలీవుడ్ హీరోలు ఏం చేస్తున్నట్లు.. అక్కడ ఇంతాల హిట్ కొట్టే హీరో.. డైరెక్టర్ లేడా అనే చర్చ జరుగుతోంది. ఆర్జీవీ ట్వీట్ తో మరింత వైరల్ అవుతోంది. ఒకప్పుడు సౌత్ సినిమాలను చిన్న చూపు చూసే బాలీవుడ్.. ఇప్పుడు సౌత్ సినిమాల రికార్డులు.. ఆ రేంజ్ సినిమాలు చేయడంలో సక్సెస్ కాలేకపోతోందా అనే చర్చ మొదలైంది.
Also Read:Hero Vijay Political Entry: హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. ఆ పార్టీ నుండి పోటీ చెయ్యబోతున్నారా??