HBD Prabhas: ప్రభాస్ పుట్టినరోజు కి రామ్ చరణ్ స్పెషల్ సర్ప్రైజ్..ఇలాంటి స్నేహితులను మీరెక్కడా చూసుండరు!

ప్రభాస్ కి అత్యంత ఆప్తులలో ఒకరైన రామ్ చరణ్ కాసేపటి క్రితమే ఆయనకు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఒక ట్వీట్ వేసాడు. 'నా డియరెస్ట్ ఫ్రెండ్ ప్రభాస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాగే సంతోషంగా నిండు నూరేళ్లు ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని కోరుకుంటున్నాను' అంటూ ట్వీట్ వేసాడు. దీనికి ఇరువురి హీరోల అభిమానుల నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

Written By: Vicky, Updated On : October 23, 2024 2:24 pm

HBD Prabhas(3)

Follow us on

HBD Prabhas: అందరి హీరోలతో ఎంతో స్నేహంగా ఉంటూ, ‘డార్లింగ్’ అని ఆప్యాయంగా పలకరిస్తూ, తాను ఒక సూపర్ స్టార్ అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయి, కేవలం ఒక సాధారణమైన వ్యక్తిగా మెలుగుతూ, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్త్వంతో కొనసాగుతూ, దాన గుణం లో కర్ణుడిని తలపించే మనస్తత్వం తో మానవత్వం చాటుకుంటూ, ఇలా ఎన్నో అద్భుతమైన గుణాలతో ఇండియన్ సినిమా రారాజుగా కొనసాగుతున్న ప్రభాస్ నేడు 45వ సంవత్సరం లోకి అడుగుపెట్టాడు. ఆయన పుట్టినరోజు వేడుకలను అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. అలాగే టాలీవుడ్ స్టార్ హీరోలు, స్టార్ సెలబ్రిటీలు కూడా ప్రభాస్ పుట్టినరోజు కి శుభాకాంక్షలు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

ముఖ్యంగా ప్రభాస్ కి అత్యంత ఆప్తులలో ఒకరైన రామ్ చరణ్ కాసేపటి క్రితమే ఆయనకు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఒక ట్వీట్ వేసాడు. ‘నా డియరెస్ట్ ఫ్రెండ్ ప్రభాస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాగే సంతోషంగా నిండు నూరేళ్లు ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ వేసాడు. దీనికి ఇరువురి హీరోల అభిమానుల నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా ప్రభాస్, రామ్ చరణ్ కలిసి గడిపిన మధుర క్షణాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తున్నారు. ప్రభాస్, రామ్ చరణ్ మంచి స్నేహితులు అనే విషయం అందరికీ తెలుసు కానీ, ఒకరిని ఒకరు ‘రా’ అని పిలుచుకునేంత చనువు ఉందని ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ షోలో చూసినప్పుడు అర్థం అయ్యింది. వీళ్లిద్దరు కేవలం మిత్రులు మాత్రమే కాదు. వ్యాపార రంగం లో భాగస్వాములు కూడా. యూవీ క్రియేషన్స్ బ్యానర్ తో రామ్ చరణ్ కలిసి ప్రస్తుతం సినిమాలను నిర్మిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ కి ప్రభాస్ సోదరుడు ప్రభోద్ యజమాని. ఈ బ్యానర్ లో ప్రభాస్ కి కూడా వాటాలు ఉన్నాయి.

ఇది ఇలా ఉండగా ప్రభాస్, రామ్ చరణ్ మధ్య ఉన్న స్నేహం గురించి, ఒకసారి ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి మాట్లాడుతూ ‘ప్రభాస్ కి ఉపాసన, రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం. ఒకసారి కృష్ణం రాజు గారికి అపోలో హాస్పిటల్స్ లో కాళ్ళు ఆపరేషన్స్ చేయించాల్సి వచ్చింది. ఆ సమయంలో ఉపాసన అన్నీ దగ్గరుండి చూసుకుంది. ఒక కూతురిలాగా జాగ్రత్తలు తీసుకుంది. కృష్ణం రాజు ఆమె చూపించిన ప్రేమకి ఎంతో సంతోషించాడు. చిరంజీవి గారికి ఫోన్ చేసి ఇలాంటి కోడలు దొరికినందుకు మీరు అదృష్టవంతులు అని పొగిడాడు’ అంటూ చెప్పుకొచ్చింది శ్యామల దేవి. ఇంత మంచి స్నేహం ఉన్న ప్రభాస్, రామ్ చరణ్ నుండి భవిష్యత్తులో కచ్చితంగా మల్టీ స్టార్రర్ చిత్రాలను ఆశించవచ్చు. ఇద్దరు కూడా పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ని సంపాదించారు, వీళ్లిద్దరి సినిమాల కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. అలాంటి వీళ్లిద్దరు కలిసి సినిమా చేస్తే బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి అద్భుతాలు నెలకొంటాయో ఊహించవచ్చు.