Ram Charan: ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా సినిమాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దమ్మున్న కథ దొరికి సూపర్ హిట్ కాంబినేషన్ సెట్టయితే చాలు బడ్జెట్ ఎంతైనా పెట్టడానికి క్యూ కడుతున్నారు ప్రొడ్యూసర్లు ఇదే టెక్నీషన్ల పాలిట వరంగా మారింది సరైన హిట్ ఒక్కటి పడితే చాలు కోట్లరూపాయల రెమ్యూనరేషన్లు అడగటానికి ఏమాత్రం వెనుకాడట్లేదు మన హీరోలు.

ఈ ఇంట్రడక్షన్ అంతా త్వరలో డైరెక్టర్ శంకర్ , మెగాపవర్ స్టార్ దిల్ రాజు కాంబోలో రాబోతోన్న ఓ బడా ప్రాజెక్ట్ కోసమే! ఇది మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజుకి యాభైవ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఇంతకీ మేటరేంటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఈ సినిమా కోసం భారీగానే డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది ఏకంగా ఎనభై కోట్ల రూపాయలను రెమ్యూనరేషన్ గా అడిగినట్లు టాక్, అయినా సరే ప్రొడ్యూసర్ దిల్ రాజ్ మాత్రం తగ్గేదే లేదంటున్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్ పై శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కబోయే ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా కియారా అద్వానీ నటించ నుంది. పాన్ ఇండియా సినిమాగా రూపు దిద్దుకో బోతోన్న ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ రామ్ చరణ్ డేట్స్ ఫిక్స్ చేశారట ఇంకేముంది? ఈ ముగ్గురి కాంబినేషన్లో సినిమా స్టార్ట్ అవకముందే ఈ ప్రాజెక్ట్ కి బోలెడంత పబ్లిసిటీ వచ్చినట్లైంది. తన యాభైవ సినిమా కావడంతో దిల్ రాజు అస్సలు తగ్గేదేలే. ఈ సినిమా కోసం 250 కోట్ల బడ్జెట్ పెట్టనున్నట్లు సమాచారం, ఏదేమైనా టాలీవుడ్ సినిమాల రేంజ్ మామూలుగా లేదుగా అంటున్నారు నెటిజన్లు.