Homeఎంటర్టైన్మెంట్Ram Charan PR team: రామ్ చరణ్ పరువు తీసేసిన పీఆర్ టీమ్..ఇంగిత జ్ఞానం ...

Ram Charan PR team: రామ్ చరణ్ పరువు తీసేసిన పీఆర్ టీమ్..ఇంగిత జ్ఞానం ఉన్నోళ్లు ఎవరైనా ఇలా చేస్తారా?

Ram Charan PR team: హీరోలకు ఈమధ్య కాలం లో పీఆర్ టీమ్స్ తలనొప్పిగా మారాయి. హీరో కోసం పని చేయకుండా, తమ సొంత స్వలాభాన్ని ఆశిస్తూ, ఎదో ఒక విధంగా హీరో కంటపడాలి అనే తపనతో కొంతమంది పీఆర్ లు చేస్తున్న వికృత చేష్టలను చూసి సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఛీ కొడుతున్నారు. మొన్న రామ్ చరణ్(Global Star Ram Charan), ఉపాసన(Upasana Konidela) దంపతులు అర్థ రాత్రి 12 గంటలకు ఇద్దరు కవలపిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత అభిమానులు సోషల్ మీడియా లో సమ్బరాలు చేసుకున్నారు. అంత వరకు బాగేనా ఉంది. కానీ రామ్ చరణ్ కి అత్యంత సన్నిహితంగా ఉండే శివ చెర్రీ అనే వ్యక్తి తన టీమ్ తో హాస్పిటల్ వద్ద చేసిన హంగామా ని చూసి ఛీ కొడుతున్నారు నెటిజెన్స్. ఉపాసన కవలపిల్లలకు డెలివరీ ఇవ్వగానే హాస్పిటల్ ఎదుట బాణాసంచాలు కాల్చారు.

హాస్పిటల్ బయట ఎవరైనా ఇలాంటి పనులు చేస్తారా?, హాస్పిటల్ కి ఎన్నో ఎమర్జెన్సీ కేసులు వస్తుంటాయి, ఎంతో మంది రోగాలతో వస్తుంటారు, అలాంటి చోట ఇలా బాణాసంచాలు కాల్చడమా?, ఇంగిత జ్ఞానం ఇసుమంత అయినా ఉందా అంటూ మెగా అభిమానులే తిడుతున్నారు. ఇది కాసేపు పక్కన పెడితే, అభిమానులను అపోలో హాస్పిటల్ వద్ద, భారీ ఎత్తున పోగు చేసాడు, ఆ శివ చెర్రీ అనే వ్యక్తి. ఫలితంగా రామ్ చరణ్ ఆ జనం మధ్యలో నుండి తన కూతురు క్లిన్ కారా తో కలిసి హాస్పిటల్ లోపలకు వెళ్లేందుకు ఎంత ఇబ్బంది పడాల్సి వచ్చిందో మనమంతా చూసాము. క్లిన్ కారా కి ఊపిరి ఆడనంత పని అయ్యింది. అభిమానులు కొంతమంది ఆ చిన్నారిని ముట్టుకునే ప్రయత్నం కూడా చేశారు. ఆ బిడ్డకు ఏమి కాలేదు కాబట్టి సరిపోయింది, పొరపాటున ఏదైనా జరిగి ఉంటే?, ఏ సందర్భం లో అభిమానులను పోగు చెయ్యాలి అనే సెన్స్ కూడా లేకుండా ఎలా అంటూ అభిమానులు మండిపడుతున్నారు.

పీఆర్ టీమ్ అటెన్షన్ కోసం చేసిన ఈ చర్యల కారణంగా రామ్ చరణ్ నిన్న బోలెడంత నెగిటివిటీ ని ఎదురుకోవాల్సి వచ్చింది. రామ్ చరణ్ కి అటెన్షన్ పిచ్చి ఎక్కువగా ఉందని , ఆయనే జనాలను పోగు చేసి తన బలాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నాడంటూ సోషల్ మీడియా లో రామ్ చరణ్ దురాభిమానులు అంటున్నారు. గతం లో ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు కూడా పిల్లలు పుట్టారు, వాళ్ళు ఇంత హడావిడి చేయలేదు, రామ్ చరణ్ మాత్రమే చేస్తున్నాడు అంటూ ఆయన వైపు వేలెత్తి చూపిస్తున్నారు. దీనికి కారణం శివ చెర్రీ అనే వ్యక్తి , దయచేసి అతన్ని నీ నుండి దూరంగా పెట్టండి అ అంటూ సోషల్ మీడియా లో రామ్ చరణ్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ని ట్యాగ్ చేసి కోరుతున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular