https://oktelugu.com/

Ram Charan : తెలంగాణ గురించి రామ్ చరణ్ ఎమోషనల్ కామెంట్స్.. వైరల్ అవుతున్న ట్వీట్!

రామ్ చరణ్ ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన వ్యక్తి అనే విషయం మన అందరికీ తెలిసిందే. కానీ ఈరోజు వేసిన ట్వీట్ లో 'మన తెలంగాణ' అని వెయ్యడం తో, చాలా మంది అభిమానులు నువ్వు ఆంధ్ర ప్రదేశ్ కదా అన్నా అంటూ కామెంట్స్ చేసారు. ఆంధ్ర తెలంగాణ అని తేడాలు చూస్తారేంటి, మనమంతా తెలుగు వాళ్ళం అంటూ మరికొంతమంది అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : June 2, 2023 / 04:22 PM IST
    Follow us on

    Ram Charan : ఆంధ్ర ప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోయి నేటికీ పదేళ్లు అయ్యింది. అంతకు ముందు అన్నీ రంగాలలో వెనుకబడిన తెలంగాణ రాష్ట్రం, ఈ పదేళ్లలో అన్నీ విభాగాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగింది. మంచి నీళ్లు కూడా సరిగా దొరకని రోజు నుండి, కాళేశ్వరం వంటి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కలిగి ఉన్న రాష్ట్రం గా తెలంగాణ రాష్ట్రం ఎన్నో రాష్ట్రాలకు దిక్సూచి గా నిల్చింది.

    ఎంతో మంది పోరాట యోధుల బలిదానాలు నడుమ, ఎన్నో ఆమరణ నిరాహార దీక్షల మధ్య, చావు దెబ్బలు తింటూ తెలంగాణ ప్రాంతాన్ని సాధించుకొని, నేడు ఈ స్థాయి అభివృద్ధి సాధించేలా చేసిన తెలంగాణ ప్రజలకు సెల్యూట్ చేస్తూ నేడు టాలీవుడ్ సినీ ప్రముఖులందరూ సోషల్ మీడియా లో పోస్టులు వేస్తున్నారు. వారిలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకడు.కాసేపటి క్రితమే ట్విట్టర్ లో ఈయన వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ గా మారిపోయింది.

    ఆయన మాట్లాడుతూ ‘ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు పూర్తి అయ్యింది.ఈ పదేళ్లలో మనం అన్నీ రంగాలలో అభివృద్ధి సాధించాము. బంగారు తెలంగాణ కోసం అప్పట్లో కన్న కలలను ఇప్పుడు నిజం చేసుకుంటున్నాము. పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ సోదర సోదరీమణులకు ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను’ అంటూ రామ్ చరణ్ వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

    రామ్ చరణ్ ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన వ్యక్తి అనే విషయం మన అందరికీ తెలిసిందే. కానీ ఈరోజు వేసిన ట్వీట్ లో ‘మన తెలంగాణ’ అని వెయ్యడం తో, చాలా మంది అభిమానులు నువ్వు ఆంధ్ర ప్రదేశ్ కదా అన్నా అంటూ కామెంట్స్ చేసారు. ఆంధ్ర తెలంగాణ అని తేడాలు చూస్తారేంటి, మనమంతా తెలుగు వాళ్ళం అంటూ మరికొంతమంది అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.