Ghani Movie: మెగా బుల్లోడు ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం “గని” ఈ చిత్రంలో వరుణ్ బాక్సింగ్ ఫైటర్ గా కనిపించనున్నారు. అయితే ఈ పాత్ర కోసం వరుణ్ తన పూర్తి లుక్ ని మార్చేశారని చెప్పాలి దీనికోసం గంటల తరబడి జిమ్ లో వర్క్ ఔట్ చేసి తన బాడీ ఆకృతిని ఒక బాక్సింగ్ ఫైటర్ మాదిరిగా ఉండేలా కృషి చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 3, ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ప్రమోషన్ లో భాగంగా ఈరోజు టీజర్ ను విడుదల చేసింది యూనిట్ బృందం.

కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ” గని” వరుణ్ తేజ హీరోగా బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అల్లు బాబీ కంపెనీ మరియు రినైసెన్స్ పిక్చర్స్ బ్యానర్లపై అల్లు బాబీ, సిద్ధు ముద్ద సంయుక్తంగా చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించారు. నదియా, నరేశ్, నవీన్ చంద్ర, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర తదితరులు సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.
అయితే ఈ టీజర్ లో ఒక స్పెషాలిటీ ఉంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ టీజర్ లో బేస్ వాయిస్ తో ” ప్రతి ఒక్కరి కథలో కష్టాలు కన్నీళ్లు ఉంటాయి కోరికలు ఉంటాయి , కోపాలు ఉంటాయి ,కనబడితే గొడవలు ఉంటాయి, అలాగే ఇక్కడున్న అందరికీ ఛాంపియన్ అయిపోవాలని ఆశ ఉంటుంది. కానీ విజేత గా నిలిచేది ఒక్కడే ఆ ఒక్కడు నువ్వే ఎందుకు అవ్వాలి మై యు…. ఆట ఆడిన ఓడిన రికార్డ్స్ లో ఉంటాం కానీ గెలిస్తే మాత్రం చరిత్రలో ఉంటాం. మేకర్స్ విడుదల చేసిన వన్ అవర్ లో మంచి రెస్పాన్స్ అందుకుంది టీజర్. ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతుంది.
Aata aadinaa vodinaa records lo vuntaav!
Kaani gelisthe matrame charitra lo vuntaav! 🥊Here you go the #GhaniTeaser :https://t.co/mBdNI73AQ8#Ghani
— Varun Tej Konidela (@IAmVarunTej) November 15, 2021