మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’తో విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ ప్లాన్ చేసిన సినిమా ఉంటుందని తేలిపోవడంతో ఇప్పుడు ఫ్యాన్స్ కి కొత్త టెన్షన్ పట్టుకుంది. ఎందుకంటే శంకర్ తీసుకున్న కథ, కమల్ హాసన్ కోసం రాసుకున్న కథ. ‘భారతీయుడు 2’ తర్వాత శంకర్ ఈ కథను కమల్ తో చేయాలనుకున్నారు. కానీ పరిస్థితులు మారాయి.
కమల్ ప్లేస్ లో చరణ్ వచ్చాడు. మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. కానీ, కమల్ హాసన్ నటనా విశ్వరూపం ఏంటనేది శంకర్ కు బాగా తెలుసు. అలాగే కమల్ ప్రత్యేకత గెటప్స్ కూడా. అందుకే శంకర్, కమల్ తో సినిమా చేస్తే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కథ రాసుకుంటాడు. కానీ తీరా ఆ కథ చరణ్ దగ్గరకు వచ్చింది. నటన విషయంలో కమల్ కు ఎవ్వరూ సాటిరారు. మరి చరణ్ ఎంతవరకు కథకు న్యాయం చేయగలడు ?
కచ్చితంగా అభిమానుల పరంగా ఇప్పుడు కమల్ కంటే, చరణ్ క్రేజే ఎక్కువ. కానీ ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తీసుకొస్తున్నారు. ఈ లెక్కన చూసుకుంటే కథకు పాత్రకు న్యాయం చేస్తేనే సినిమా వర్కౌట్ అవుతుంది. అయినా కమల్ హాసన్ చేయాల్సిన క్యారెక్టర్ ను చరణ్ తోనే చేయించి, శంకర్ తప్పు చేస్తున్నాడా ? నిజానికి శంకర్ ఈ సినిమాని చరణ్ తో చేయాలనుకోలేదు.
కానీ లైకా సంస్థతో వచ్చిన గొడవల నేపథ్యంలో శంకర్ తన పవర్ చూపించడానికి శంకర్, చరణ్ కి ఫిక్స్ అయ్యాడు. ఏది ఏమైనా తన సినిమాల్లో హీరోల్ని డిఫరెంట్ గెటప్స్, మేకప్స్ లో చూపించే ఆనవాయితీ ఉన్న శంకర్, రామ్ చరణ్ ను కొత్తగా చూపిస్తాడు. పైగా ఈ సినిమాలో చరణ్ ది డ్యూయల్ రోల్. అందులోనూ ఒక రోల్ ఫాదర్ క్యారెక్టర్. అంటే.. చరణ్ 55 ఏళ్ల వయసు వాడిగా కనిపిస్తాడు. అయితే, గెటప్ లు ఓకే మరి నటన మాటేమిటి ?