Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన అతి త్వరలోనే తల్లితండ్రులు అవ్వబోతున్నారు అనే విషయం అందరికీ తెలిసిందే. గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి ఎంతో సంతోషం తో ఈ విషయాన్నీ అభిమానులతో పంచుకున్నాడు. ఈ విషయం ఆయన చెప్పినప్పటి నుండి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు రామ్ చరణ్ బిడ్డ ఈ ప్రపంచం లోకి అడుగుపెడుతుందా అని ఏంటో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు.
ఆ శుభతరుణం రానే వచ్చింది. రేపు ఉపాసన డెలివరీ అవ్వబోతుంది అంటూ సోషల్ మీడియా లో కాసేపటి క్రితం నుండి ప్రచారం అవుతున్న ఒక వార్త అభిమానులను పండుగ చేసుకునేలా చేస్తుంది. మగబిడ్డ పుట్టబోతున్నాడా, లేదా ఆడ బిడ్డ పుడుతుందా అనేది రేపటి లోపే తెలియనుంది. ప్రపంచం లోనే అత్యంత అనుభవం ఉన్న గైనకాలజిస్ట్స్ అందరూ ఇప్పుడు అపోలో హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. ఇది ఇలా ఉండగా రామ్ చరణ్ కాసేపటి క్రితమే ప్రముఖ సంగీత దర్శకుడు కాళ భైరవ కి కృతఙ్ఞతలు తెలియచేస్తూ ఒక ట్వీట్ వేసాడు.
ఆయన మాట్లాడుతూ ‘మా బిడ్డ కోసం నువ్వు కంపోజ్ చేసిన ఈ ట్యూన్ ఎంతో అద్భుతంగా ఉంది, థాంక్స్ కాళ భైరవ, ఏ ట్యూన్ మా బిడ్డకి మాత్రమే కాదు , ఈ ప్రపంచం లో ఉన్న పసిపిల్లలందరికీ ఎంతో సంతోషాన్ని ఇస్తుందని నమ్ముతున్నాను’ అంటూ రామ్ చరణ్ ఒక ఎమోషనల్ ట్వీట్ కాసేపటి క్రితమే వేసాడు. దీనితో అభిమానులకు రామ్ చరణ్ రేపు తండ్రి కాబోతున్నాడు అనే విషయాన్నీ పరోక్షంగా చెప్పాడని, రేపే కచ్చితంగా మా మెగా ఫ్యామిలీ కి మరో కొత్త వారసుడు రాబోతున్నాడు అంటూ సంబరాలు చేసుకుంటున్నారు మెగా ఫ్యాన్స్.
ప్రస్తుతం ఉపాసన హాస్పిటల్ లోనే ఉందని, ఆమె కోసం అపోలో హాస్పిటల్ లో ఒక ఫ్లోర్ మొత్తాన్ని బ్లాక్ చేసారని తెలుస్తుంది. రామ్ చరణ్ కూడా రెండు రోజుల నుండి అక్కడే స్పెషల్ లాంజ్ లో ఉంటూ రామ్ చరణ్ కావాల్సిన అవసరాలన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడట,భార్య మీద ఎంత ప్రేమో అని సోషల్ మీడియా లో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Thank you @kaalabhairava7, for creating this tune for us. We are sure this melody will bring happiness and joy to millions of children across the globe.. pic.twitter.com/911bGK4GZz
— Ram Charan (@AlwaysRamCharan) June 19, 2023