Ram Charan Screen Time With Chiranjeevi In Acharya: మెగాస్టార్ చిరంజీవి, – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకే ప్రైమ్ లో కలిసి శత్రువుల పై కలిసికట్టుగా ఫైట్ చేస్తే చూడటానికి అద్భుతంగా ఉంటుంది కదా.. క్లాస్ డైరెక్టర్ కొరటాల శివ ఆ అద్భుతాన్ని ఆచార్య రూపంలో నిజం చేయబోతున్నాడు. ఆచార్యలో చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కాగా చరణ్ పాత్ర ఈ సినిమాలో ఎంతసేపు ఉంటుందో లీక్ అయింది.

ఆచార్యలో చరణ్ పాత్ర నిడివి సుమారు 24 నిమిషాలు ఉండబోతుంది. చిరు – చరణ్ మధ్య ఉండే సన్నివేశాలు ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్ మెంట్ అందిస్తాయట. ఏప్రిల్ 29న సమ్మర్ కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం రన్ టైం సుమారు 2 గంటల 58 నిమిషాలు ఉండేలా కొరటాల ప్లాన్ చేశాడు.
Also Read: Hero Nithin Birthday Special: హ్యాపీ బర్త్ డే నితిన్… తెలంగాణ రెండో కథానాయకుడు
మెగాస్టార్ – మెగా పవర్ స్టార్ కాంబినేషన్ చూడాలని మెగా ఫ్యాన్స్ ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య రిలీజ్ అయిన వీరిద్దరూ కలిసి ఉన్న పోస్టర్ కూడా చాలా బాగా ఆకట్టుకుంది. ఆ పోస్టర్ లో చరణ్ అటు వైపు తిరిగి ఉండగా, వెనుక నుండి మెగాస్టార్, చరణ్ భుజం పై చేయి వేస్తోన్న షాట్ ను ఫోటో తీసి రిలీజ్ చేశారు.
ఈ ‘ఆచార్య’ రాష్ట్రంలోని దేవాలయాలు మరియు అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన అన్యాయాలను అక్రమాలను అరికట్టే శక్తిగా రాబోతున్నాడు. మెగాస్టార్ నుండి ఇలాంటి సినిమా గతంలో ఎప్పుడూ రాలేదు. దాంతో ఈ నేపథ్యంలో సినిమా వస్తోంది అనేసరికి ఫ్యాన్స్ రెట్టింపు ఉత్సాహంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాలో మెగాస్టార్ ను ఎండోమెంట్స్ విభాగానికి చెందిన అధికారికంగా కొరటాల చూపించబోతున్నాడు. పైగా ప్రస్తుతం మెగాస్టార్ ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు లుక్ కూడా చేంజ్ చేయడం ఆసక్తి రేపుతోంది. కాజల్ ఈ సినిమాలో ఒక జర్నలిస్ట్ గా నటిస్తోంది. అలాగే రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపించబోతున్నాడు.

హీరోయిన్ రెజీనా ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. ఇక మెగాస్టార్ తో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమా పై మంచి బజ్ ఉంది. పైగా చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అన్నిటికీ మించి ‘కమర్షియల్ క్లాసిక్ డైరెక్టర్’ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే మెగాస్టార్ ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు.
Also Read: Anasuya Bharadwaj: వైరల్ : రకరకాలుగా అందాలను వెదజల్లుతున్న అనసూయ
[…] Celebrities Chose Surrogacy Parenthood: కాలం మారుతోంది అంటే ఏమో అనుకున్నాం గానీ.. చివరకు పిల్లల్ని కనడం కూడా చాలామందికి పెద్ద ఇబ్బందిగానే మారుతోంది. ముఖ్యంగా సినీ సెలబ్రిటీల్లో చాలామంది సరోగసి ద్వారా పిల్లల్ని కంటున్నారు. ఇలా పిల్లల్ని పొందిన వారెవరో ఇప్పుడు చూద్దాం. పోర్న్ స్టార్ సన్నిలియోన్ ఒక కూతురును దత్తత తీసుకున్న తర్వాత.. మిగతా పిల్లల కోసం సరోగసిని వినియోగించుకుంది. సరోగసి ద్వారా కవల పిల్లలు నోహ్, ఆషర్ పుట్టారు. […]