spot_img
Homeఎంటర్టైన్మెంట్Ram Charan Reject Sandeep Reddy Vanga Story: సందీప్ రెడ్డి వంగ చెప్పిన కథ...

Ram Charan Reject Sandeep Reddy Vanga Story: సందీప్ రెడ్డి వంగ చెప్పిన కథ కి రామ్ చరణ్ నో చెప్పాడా..? అసలు మ్యాటర్ అదేనా..?

Ram Charan Reject Sandeep Reddy Vanga Story: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాలను క్రియేట్ చేయగలిగే దర్శకులలో సందీప్ రెడ్డివంగా ఒకరు… ఆయన చేసిన అర్జున్ రెడ్డి, అనిమల్ సినిమాలు పెను ప్రభంజనాలను సృష్టించడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే తనను టాప్ డైరెక్టర్ గా నిల్చో బెట్టాయి. ఇక అలాంటి దర్శకుడి నుంచి రాబోతున్న సినిమాల విషయంలో ఆయన చాలా క్లారిటీని మెయింటైన్ చేస్తున్నాడు. ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి… ఇప్పటివరకు ఆయన భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ సినిమా విషయంలో కూడా ఆయన పలు జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఆయన రామ్ చరణ్ కి ఒక కథనైతే వినిపించారట. రామ్ చరణ్ మాత్రం ఆకథ కి నో చెప్పినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. కారణం ఏంటి అంటే సందీప్ రెడ్డి వంగ సినిమాల్లో బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి.

Also Read: అసెంబ్లీలో ‘గులాబీ’ ఫైట్: కెప్టెన్ కేసీఆర్ లేని గ్రౌండ్.. రేవంత్ ‘సిక్స్’ల పండగ!

ప్రభాస్ తో చేస్తున్న ‘స్పిరిట్’ సినిమా విషయంలో కూడా ఆయన కొన్ని బోల్డ్ సీన్స్ ని తగ్గించినప్పటికి కొన్ని మాత్రం సినిమాలో భాగమై ఉన్నాయట. కాబట్టి వాటిని తప్పకుండా చూపించాల్సిన సందర్భం ఉందట. ఇక రామ్ చరణ్ తో చేయబోతున్న సినిమా విషయంలో కూడా బోల్డ్ సీన్స్ ఉంటున్నాయట.

అందువల్ల రామ్ చరణ్ సైతం తనకు ఆ కథను నచ్చలేదని చెప్పాడనే వార్తలు వస్తున్నాయి… ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలియదు కానీ మొత్తానికైతే రామ్ చరణ్ సందీప్ రెడ్డి వంగ కి నో చెప్పడనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత సుకుమార్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత సందీప్ రెడ్డివంగ సినిమా చేయాలి అని అనుకున్నప్పటికి ఆయన కథ తనని పెద్దగా ఇంప్రెస్ చేయకపోవడంతో ఇప్పుడు ఆ కథని హోల్డ్ లో పెట్టినట్టుగా తెలుస్తుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version