Ram Charan: ఇంకో నాలుగు రోజుల్లో ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ప్రతి రాజకీయ పార్టీ కూడా భారీ ఎత్తున ప్రచారాలను నిర్వహిస్తుంది. ఇక అందులో భాగంగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. లాస్ట్ టైం తను రెండు చోట్ల నుంచి ఓడిపోవడం చాలా బాధాకరమైన విషయం.
కాబట్టి ఈసారి పిఠాపురం నుంచి ఎలాగైనా సరే గెలిచి అసెంబ్లీకి వెళ్లాలనే దృఢ సంకల్పంతో పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే తనతో పాటు నిలుచున్న తన మెంబర్స్ అందరినీ గెలిపించుకునే ప్రయత్నంలో కూడా తను ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలవాలని మంగళవారం రోజు మెగాస్టార్ చిరంజీవి ఒక వీడియోని రిలీజ్ చేశాడు. అందులో “నా తమ్ముడికి మీరందరూ సపోర్ట్ చేసి గెలిపిస్తే మీకు ఒక అన్నల ముందు ఉంటాడు” అంటూ చిరంజీవి ఆ వీడియో లో చెప్పడం విశేషం…
ఇక ఆ తర్వాత నాచురల్ స్టార్ నాని అలాగే తేజ సజ్జా, రాజ్ తరుణ్ లాంటి యంగ్ హీరోలు కూడా పవన్ కళ్యాణ్ కి సపోర్టుగా ట్వీట్లు చేశారు. ఇక పవన్ కళ్యాణ్ కి మద్దతు పలుకుతూ చిరంజీవి పోస్ట్ చేసిన వీడియోని షేర్ చేస్తూ “మీ భవిష్యత్తు కోసం పాటు పడే పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసి గెలిపించండి” అంటూ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు తను తెలియజేయడం నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి.
ఇక ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంలో చాలా మంది స్టార్ హీరోలు వరుణ్ తేజ్, వైష్ణవ తేజ్, సాయి ధరమ్ తేజ్ లతోపాటు, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, శకలక శంకర్ లాంటి కొంత మంది జబర్దస్త్ అరిస్టులు కూడా పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రచారం చేయడం విశేషం…ఈ లెక్కన పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో చాలా భారీ మెజార్టీతో గెలవబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. చూడాలి మరి ఈసారి పవన్ కళ్యాణ్ గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడతాడా లేదా అనేది…