Peddi Movie: ‘హరి హర వీరమల్లు’ సినిమా విడుదల సమయం లో దిల్ రాజు మరియు ఆయనకు సంబంధించిన గ్యాంగ్ కమీషన్ బేసిస్ మీద థియేటర్స్ ని రన్ చెయ్యాలి , లేదంటే మూసేస్తాం అంటూ పెద్ద ఎత్తున రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై పవన్ కళ్యాణ్ చాలా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన థియేటర్స్ పై రైడింగ్ చెయ్యమని అధికారులను ఆదేశించడం, అదే విధంగా ఇక పై టికెట్ రేట్స్ రావాలంటే వేరే పద్దతి ని అనుసరించాలని అధికారులకు ఆర్డర్లు వేయడం వంటివి చేయడం తో , అప్పట్లో ఈ గ్యాంగ్ కాస్త భయపడి , థియేటర్స్ బంద్ చెయ్యాలనే ఆలోచన విరమించుకున్నారు. ఇప్పుడు ఇదే గ్యాంగ్ మరో మూడు వారాల్లో విడుదల అవ్వబోతున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాకు ఆటంకాలు కలిగించాలని చూస్తున్నారు.
నిన్న దిల్ సోదరుడు శిరీష్ , సునీల్ నారంగ్ తదితరులు ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి కమీషన్ బేసిస్ మీదనే సినిమాలను నడపాలని, లేని పక్షం లో సింగల్ స్క్రీన్ థియేటర్స్ మూతపడే పరిస్థితి వచ్చిందని, ప్రభుత్వం టికెట్ రేట్స్ పెంచుకోవడానికి జీవో ని జారీ చేసినప్పటికీ కూడా మేము మా సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ రేట్స్ పెంచమని ఇలా ఎన్నో రకాల వ్యాఖ్యలు చేశారు. దీనికి కౌంటర్ గా నేడు మైత్రీ మూవీ మేకర్స్ రవి శంకర్ , నాగవంశీ , సాహు గారపాటి వంటి వారు ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి దిల్ రాజు గ్యాంగ్ అనుసరిస్తున్న వైఖరి ని తప్పుబట్టారు.
ముందుగా రవిశంకర్ మాట్లాడుతూ ‘హరి హర వీరమల్లు సినిమా విడుదలైన సమయంలో మొదలైన అంశం ఇది. ఆ తర్వాత దిల్ రాజు ప్రొడక్షన్స్ నుండి నైజాం ప్రాంతం లో ఎన్నో సినిమాలు విడుదల చేశారు. వార్ 2, కూలీ, ఓజీ, అఖండ 2, ఈ సంక్రాంతికి విడుదలైన సూపర్ హిట్ సినిమాలన్నీ మీరే విడుదల చేశారు. ఇన్ని సినిమాలు విడుదల చేసినప్పుడు ఎక్సిభిటర్స్ కస్టాలు మీకు కనపడలేదా , మీ చేతుల్లో ఇప్పుడు పెద్ద సినిమాలేవీ లేవు కాబట్టి, ఇప్పుడే కమీషన్ బేసిస్ మీద సినిమాలను సింగిల్ స్క్రీన్స్ లో రన్ చెయ్యాలి అనడం కరెక్ట్ కాదు, అందరూ కూర్చొని మాట్లాడుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. చూస్తుంటే రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం పెద్ద రేంజ్ కి వెళ్లేలా ఉందని , ‘పెద్ది’ చిత్రానికి నైజాం ప్రాంతం లో కష్టాలు తప్పేలా లేవని అంటున్నారు విశ్లేషకులు.
Mythri Ravi Straight Question to SVC Sirish.
Why are you silent when you had so many releases till Sankranthi and speaking only now? pic.twitter.com/Dl8nrfFsGC
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) May 13, 2026