Peddi movie interval scene leak: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) హీరో గా నటించిన ‘పెద్ది'(Peddi Movie) మూవీ చిత్రం అనేక వాయిదాల తర్వాత జూన్ నెలలో విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని జూన్ 25 న విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించబోతున్నారు. నిన్న మొన్నటి వరకు ఈ సినిమాలోని ‘రయ్ రయ్’ పాటకు సంబంధించిన ప్యాచ్ వర్క్ షూటింగ్ ని జానీ మాస్టర్ నేతృత్వం లో చిత్రీకరించారు. ఇక రేపటి నుండి ఐటెం సాంగ్ చిత్రీకరణ జరగబోతుంది. చాలా మంది హీరోయిన్స్ పేర్లను పరిశీలించిన మేకర్స్ , చివరికి శృతి హాసన్ ని లాక్ చేశారు. గతం లో రామ్ చరణ్ , శృతి హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఎవడు’ చిత్రం ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో అందరికీ తెలిసిందే.
మళ్లీ ఈ కాంబినేషన్ ని చాలా రోజులు తర్వాత చూడబోతున్నాము అన్నమాట. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించిన ఇంటర్వెల్ సన్నివేశం ఎలా ఉండబోతుందో సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. రామ్ చరణ్ నట విశ్వరూపాన్ని ఈ ఇంటర్వెల్ సన్నివేశంలో చూస్తామని , నేషనల్ లెవెల్ లో ప్రతీ ఒక్కరు దీని గురించి మాట్లాడుకుంటారని అంటున్నారు. సాధారణంగా స్టార్ హీరోల సినిమాల్లో ఇంటర్వెల్ సన్నివేశాలు భారీ ఫైట్ సన్నివేశంతో కానీ , లేదంటే భారీ ఎలివేషన్ తో కానీ ముగిస్తారు. కానీ ఇక్కడ రామ్ చరణ్ తన నటనతో ఇంటర్వెల్ సన్నివేశం లో గూస్ బంప్స్ రప్పించబోతున్నాడు అని అంటున్నారంటే , కచ్చితంగా బుచ్చి బాబు ఎదో చాలా పెద్ద ప్లాన్ వేసాడని అంటున్నారు విశ్లేషకులు. కేవలం ఇంటర్వెల్ సన్నివేశం ఒక్కటే కాదు , చివరి 40 నిమిషాలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని విధంగా ఉంటుందట.
ఆ రేంజ్ లో డిజైన్ చేశాడట బుచ్చి బాబు. ఓవరాల్ గా నటన పరంగా, కంటెంట్ పరంగా ఈ చిత్రం ‘రంగస్థలం’ కి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటుందని , అదే రేంజ్ టాక్ కూడా వస్తే వెయ్యి కోట్ల గ్రాస్ మార్కుని రామ్ చరణ్ అవలీలగా అందుకుంటాడని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఐటెం సాంగ్ చిత్రీకరణ పూర్తి అయ్యాక, విడుదల తేదీని అధికారికంగా ప్రకటించి, పాన్ ఇండియా లెవెల్ లో ప్రొమోషన్స్ చేయడానికి సిద్దమయ్యారట మేకర్స్. సినిమా ఆలస్యం అవుతుందనే కంగారు అసలు వద్దని , ఆలస్యం అయినప్పటికీ కూడా, అభిమానులకు ఈ చిత్రం భుక్తాయాసం ఇచ్చే రేంజ్ లో ఉంటుందని అంటున్నారు.