Homeఎంటర్టైన్మెంట్Peddi 12 Days Collections: పెద్ది' 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. సీడెడ్ ,...

Peddi 12 Days Collections: పెద్ది’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. సీడెడ్ , నెల్లూరు ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ అసాధ్యమే..

Peddi 12 Days Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ బాక్స్ ఆఫీస్ జోరు, 12 రోజులు దాటినప్పటికీ కూడా ఏ మాత్రం తగ్గలేదు. వర్కింగ్ డేస్ లో ఈ చిత్రానికి వస్తున్నంత లాంగ్ రన్ , ఈమధ్య కలం లో ఏ స్టార్ హీరో సినిమాకు కూడా రాలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి 2వ సోమవారం, అనగా 12 వ రోజున దాదాపుగా 1 కోటి 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిందని అంటున్నారు. ఇది సాధారమైన విషయం కాదు. ఈ రేంజ్ రన్ ఉన్నప్పటికీ కూడా ఈ చిత్రానికి రాయలసీమ , నెల్లూరు జిల్లాల్లో నష్టాలు తప్పేలా లేవని లేటెస్ట్ గా వినిపిస్తున్న మాట.

రాయలసీమ ప్రాంతం లో ఈ చిత్రానికి విడుదలకు ముందు 24 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 12 రోజుల్లో 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో 4 కోట్లు రావాలి , ప్రస్తుతం ఉన్న పరిస్థితి లో అయితే మరో రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ప్రాంతం లో బ్రేక్ ఈవెన్ కష్టమే. ఇక నెల్లూరు జిల్లా విషయానికి వస్తే విడుదలకు ముందు ఈ చిత్రానికి 6 కోట్ల 30 లక్షల రూపాయిల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పటి వరకు 5 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి, బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 80 లక్షల షేర్ రావాలి , ప్రస్తుత ట్రెండ్ ప్రకారం చూస్తే మరో 50 లక్షలు మాత్రమే వచ్చేలా కనిపిస్తోంది.

ఇక మిగిలిన జిల్లాల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని లాభాల్లోకి అడుగుపెట్టింది. నైజాం ప్రాంతం లో ఇప్పటి వరకు ఈ చిత్రానికి 51 కోట్ల 88 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 21 కోట్ల 53 లక్షలు రాగా , ఈస్ట్ గోదావరి నుండి 12 కోట్ల 18 లక్షలు , వెస్ట్ గోదావరి నుండి 8 కోట్ల 63 లక్షలు , గుంటూరు నుండి 12 కోట్ల 12 లక్షలు , కృష్ణ నుండి 9 కోట్ల 72 లక్షలు , నెల్లూరు నుండి 5 కోట్ల 53 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 141 కోట్ల 59 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 213 కోట్ల 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 322 కోట్ల 25 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 192 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version