RRR Oscar Race 2023: ఒక తెలుగు సినిమా అంతర్జాతీయ అవనికపై ‘ఆస్కార్’ కొట్టాలనే ఆశ అందరికీ ఉంటుంది. అన్ని సినిమాలు రిలీజ్ అయ్యి అంతో ఇంతో బ్లాక్ బస్టర్ అవుతున్నా ఆ అంతర్జాతీయ ఆస్కార్ కొట్టాలన్న ఆశమాత్రం ఇంకా అందరికీ ఉంది. అలాంటి సినిమా రావాలని కోరుకునే వాళ్లు ఎంతో మంది ఉన్నారు.

మన జక్కన్న చెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీకి ఆస్కార్ నామినేట్ అయ్యే ఛాన్స్ ఉందని.. ఖచ్చితంగా ఈ మూవీ ఆస్కార్ ను కొడుతుందన్న ఆశ అందరిలో ఉండేది. కానీ మన దేశం నుంచి ఆస్కార్ సినిమా అధికారికంగా ఆస్కార్ అవార్డ్ కు నామినేట్ కాకపోవడంతో చాలా మంది నిరాశ చెందారు. ఇప్పుడు అభిమానులు గొప్ప శుభవార్త చెప్పింది ఆర్ఆర్ఆర్ టీం.
Also Read: Sukumar Remuneration: పుష్ప2 కోసం సుకుమార్ పారితోషికం ఎంతో తెలుసా?
ఆస్కార్ అవార్డుల కోసం ఆర్ఆర్ఆర్ టీం అధికారికంగా ప్రచారం మొదలుపెట్టింది. ‘FOR YOUR Consideration’ ఎఫ్.వై.సీ కింద బెస్ట్ మోషన్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, ఇలా 15 విభాగాల్లో క్యాంపెయిన్ స్టార్ట్ చేసినట్టు ఈ మూవీ దర్శకుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ ట్వీట్ చేశారు.

దీన్ని బట్టి దేశం నుంచి ఆస్కార్ కు నామినేట్ కాకపోయినా.. ప్రైవేట్ కేటగిరీ ‘ఎఫ్.వైసీ’ కింద ఆస్కార్ ను ఫ్యాన్స్ డిమాండ్ మేరకు ఆస్కార్ నిర్వాహకుల దృష్టికి తీసుకురావడానికి ఆర్ఆర్ఆర్ టీం రెడీ అయ్యింది. అశేష అభిమానులే మద్దతుగా సాగుతున్న ఈ కాంపిటేషన్ లో మీరూ మీ ఓటు వేసి మన తెలుగు సినిమాను ఆస్కార్ బరిలో నిలుపుదాం.. మరి ఇంకెందుకు ఆలస్యం ఓటింగ్ షురూ చేయండి..
Also Read: Allu Arvind Ali : ఇటీవలే సన్మానం అంతలోనే… అలీపై అల్లు అరవింద్ ఫైర్!
[…] Also Read: RRR Oscar Race 2023: గుడ్ న్యూస్: ఆస్కార్ రేసులో RRR […]