Ram Charan Peddi Movie: ‘చిరుత’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ‘రామ్ చరణ్’ ‘మగధీర’ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేశాడు. అప్పటినుంచి స్టార్ హీరోగా మారిపోయానా రామ్ చరణ్ రంగస్థలం సినిమాతో ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ‘త్రిబుల్ ఆర్ ‘ సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇప్పుడు ‘పెద్ది’ మూవీతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అయ్యాడు. అయితే ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయిన నేపథ్యంలో ఈ సినిమాకి మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ అయితే వస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. దానికోసం ఆయన ఎంతగా కష్టపడ్డాడో అతని బాడీని చూస్తే మనకు అర్థం అయిపోతుంది. ఆ క్యారెక్టర్ కోసం ఒక హీరో అంతలా కష్టపడతాడా అనేది కూడా మనం రామ్ చరణ్ ను చూసి నేర్చుకోవచ్చు. అయితే ఈ సినిమాతో ఆయన నెంబర్ వన్ హీరోగా మారిపోవడం ఖాయం అంటూ చాలామంది చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు.
ఇక దాంతో పాటుగా అతనికి నేషనల్ అవార్డు కూడా వస్తుందని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ ఒక క్యారెక్టర్ కోసం ఇంతలా కష్టపడడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. అలాంటి రామ్ చరణ్ రాబోయే రోజుల్లో కూడా డిఫరెంట్ సినిమాలను చేసి ప్రేక్షకుల్లో ఒక కొత్త అనుభూతిని నింపాలనే ప్రయత్నంలో ఉన్నాడు.
కెరియర్ స్టార్టింగ్ లో రొటీన్ సినిమాలను చేసిన ఆయన ఇప్పుడు మాత్రం ఎక్స్పరిమెంటల్ సినిమాల వైపే అడుగులు వేస్తున్నాడు. ఇక పెద్ది సినిమా కథ రొటీన్ గా ఉన్నప్పటికి తన ఎగ్జిక్యూషన్ కొంతవరకు ఎఫెక్టివ్ గా ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆ క్యారెక్టర్ లో బుచ్చిబాబు రామ్ చరణ్ ని చాలా బాగా పోట్రే చేశాడు. బుచ్చి బాబు సినిమాను నడిపించిన విధానాన్ని పక్కన పెడితే రామ్ చరణ్ క్యారెక్టర్ మీద ఆయన పెట్టిన ఫోకస్ కూడా చాలా బాగుంది.
ప్రతి మూమెంట్లో రామ్ చరణ్ ను ఎలివేట్ చేసిన విధానం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది… మొత్తానికైతే రామ్ చరణ్ ఈ సినిమాతో నేషనల్ అవార్డు గెలవడం పక్క అంటూ పలువురు సినిమా మేధావులు సైతం కామెంట్లు చేస్తున్నారు…
