Ram Charan Missed Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. చిరంజీవి దగ్గర నుంచి రామ్ చరణ్ వరకు ప్రతి ఒక్కరు వాళ్ళ సత్తాను చాటుతూ ముందుకు దూసుకెళ్లిన వారే కావడం విశేషం…ఇక ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లాంటి హీరోలు టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు. అలాగే వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లాంటి హీరోలు మీడియం రేంజ్ హీరోలుగా తమ హవాని చూపిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఇప్పటివరకు వీళ్ళు సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో మరింత ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలు అతనికి పెద్దగా సక్సెస్ లను సాధించి పెట్టడం లేదు. గత సంవత్సరం చేసిన గేమ్ చేంజర్ సినిమాతో భారీ డిజాస్టర్ ని మూట గట్టుకున్న ఆయన ఇప్పుడు చేస్తున్న పెద్ది సినిమా మీదనే తన పూర్తి ఆశలైతే పెట్టుకున్నాడు… ఇక ఈ క్రమంలోనే ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. తద్వారా ప్రేక్షకులకు ఎనలేని గుర్తింపును తీసుకొస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన రాని గుర్తింపు రామ్ చరణ్ చాలా తక్కువ సినిమాలతోనే తెచ్చుకున్నాడు. కాబట్టి అతనికి ఇండస్ట్రీలో మంచి ఐడెంటిటి క్రియేట్ అయింది. ఇక తనని తాను స్టార్ హీరోగా మరోసారి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. అయితే రామ్ చరణ్ చేయాల్సిన ఒక సినిమాని ధనుష్ చేసి సూపర్ సక్సెస్ సాధించాడనే విషయం చాలా మందికి తెలియదు…
వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా చేసిన ‘సార్’ సినిమాని మొదట రామ్ చరణ్ తో చేయాలని అనుకున్నారట. కానీ అనుకోని కారణాల వల్ల రామ్ చరణ్ ఈ సినిమాకి నో చెప్పడంతో ధనుష్ ఈ సినిమాని చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇక ఏది ఏమైనా కూడా సార్ సినిమా రామ్ చరణ్ కి అంత పెద్దగా సెట్ అయ్యేది కాదని మరి కొంతమంది చెబుతున్నారు.
ఎందుకంటే అందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికి రామ్ చరణ్ ఇమేజ్ కి సరిపడా కథ అది కాదని అందువల్లే ఆయన ఆ కథని రిజెక్ట్ చేశారని మరి కొంత మంది చెబుతున్నారు. ధనుష్ అయితే ఎలాంటి కథనైనా సరే తనకు అనుగుణంగా మార్చుకొని సినిమా చేయగలిగే కెపాసిటి ఉన్నవాడు కాబట్టి అతను ఆ సినిమాను చేశాడని మరి కొంతమంది చెబుతున్నారు…