Site icon OkTelugu

Men Life Struggles: ఎక్కి ఎక్కి ఏడవలేరు ఎదవ మగ పుట్టుక

Men Life Struggles

Men Life Struggles

Men Life Struggles: వాడికేంటి మగాడు.. మూతి మీద మీసం ఉంది.. ఏదైనా చేసే దమ్ముంది.. ఇంట్లో బాస్.. అతడు ఎంత చెప్తే అంత.. ఏం చేస్తే అంత.. సరదాగా దోస్తుల దగ్గరికి వెళ్తాడు. ఇబ్బంది కలిగితే సినిమాకి వెళ్తాడు. మనసు లాగితే దమ్ము లాగుతాడు. కాస్త చిరాకుగా అనిపిస్తే మందేస్తాడు. ఆ తర్వాత చిందేస్తాడు.. నచ్చిన మాంసం తింటాడు. మెచ్చినట్టుగా జీవితాన్ని అనుభవిస్తాడు. వాడు మగాడ్రా బుజ్జి..

చాలామంది మగాళ్ళ గురించి ముఖ్యంగా ఆడవాళ్లు ఇలానే అనుకుంటారు.. మగవాళ్ళ గురించి నిత్యం ఆడి పోసుకుంటూనే ఉంటారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ.. మగవాడి జీవితంలో కనిపించని కన్నీళ్లు ఉన్నాయి. రకంగా చెప్పాలంటే మగవాళ్ళ జీవితం బయటికి కనిపించేత గొప్పగా ఉండదు. లోపల మగాళ్లకు కూడా ఎన్నో రకాల కన్నీళ్లు ఉంటాయి. చెప్పుకోలేని బాధలు ఉంటాయి.. మగవాళ్ళ ఆరోగ్యాల్లో ఎన్నో దశలు ఉంటాయి. మార్పులు కూడా ఉంటాయి. అలాంటి ఒక ముఖ్యమైన దశను andropause అని పిలుస్తారు.

ఆండ్రో పాస్ అనేది ఆడవాళ్లకు మోనోపాస్ లాంటిదే. కాకపోతే ఇది మగవాళ్లలో ఒకేసారి రాదు. క్రమక్రమంగా జరిగే శారీరక, మానసిక మార్పుల ప్రక్రియ. మగవాళ్లకు 40 నుంచి 50 సంవత్సరాల మధ్య ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ తగ్గిపోయినప్పుడు మగవాళ్లలో ఈ మార్పు కనిపిస్తుంది. మగవాళ్లల్లో ఆండ్రో పాస్ అనేది ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. శక్తిని నియంత్రిస్తుంది. ముఖ్యంగా శృంగార సామర్థ్యాన్ని పూర్తిగా నియంత్రిస్తుంది. వయసు పెరుగుతున్న క్రమంలో ఈ హార్మోన్ స్థాయి క్రమక్రమంగా తగ్గుతూ ఉంటుంది. దీనివల్ల శరీరంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తూనే ఉంటాయి. ఒకప్పటి మాదిరిగా శక్తి ఉండదు. చిన్నపనికే అలసట అనిపిస్తుంది. కొవ్వు పెరుగుతుంది. కండల స్థాయి తగ్గుతుంది. నిద్ర సమస్యల గురించి చెప్పాల్సిన అవసరం లేదు…

ఆండ్రో పాస్ అనేది మగాళ్లలో కేవలం శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా గట్టి ప్రభావం చూపిస్తుంది. ఉన్న విషయాలకి అసహనం పెరిగిపోతూ ఉంటుంది. ఇటువంటి కారణం లేకుండానే కోపం వస్తుంది. నేను ఏం సాధించాను అనే అని నిరాశపూరితమైన ఆలోచనలు వస్తూనే ఉంటాయి. చాలామంది ఈ ఫీలింగ్స్ బయటికి చెప్పడానికి ఇష్టపడరు. నిశ్శబ్దంగా తమ బాధను అనుభవిస్తూ ఉంటారు.

ఈ సమయంలో మగవాళ్ళు తమ వ్యక్తిగత సంబంధాల విషయంలో కూడా ఇబ్బంది పడతారు. సరిగా మాట్లాడలేరు. భార్యతో కమ్యూనికేషన్ తగ్గే అవకాశం ఉంటుంది. ఒకరకంగా వారితో దూరంగా ఉన్నట్టు భావన కలుగుతుంది. ఇది ప్రేమను తగ్గిస్తుంది. చాలామంది ఆడవాళ్లు ఈ విషయంలో మగాళ్ళ మీద ఫిర్యాదులు చేస్తుంటారు. కానీ మగాళ్లు తమ లోపల జరుగుతున్న హార్మోన్ ప్రభావాన్ని.. మానసిక మార్పులు బయటకు చెప్పుకోలేరు.

ఈ దశను వైద్యులు మిడ్ లైఫ్ ట్రాన్ఫిషన్ అని పిలుస్తుంటారు. ఈ సమయంలో మగవాళ్ళు తమ గతం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. భవిష్యత్తు గురించి తలుచుకొని బాధపడుతుంటారు. ఈ సమయంలోనే తాము ఏమిటో నిరూపించుకోవాలని అనుకుంటారు. అయితే ఈ దశను మగవాళ్ళు సులభంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జీవనశైలిని పాటించాలి. క్రమ తప్పకుండా వ్యాయామం చేయాలి. సరైన స్థాయిలో నిద్రపోవాలి. ఒత్తిడిని పూర్తిగా తగ్గించుకోవాలి. మంచి ఆహారం తీసుకోవాలి. తాము ఎదుర్కొంటున్న భావాలను భాగస్వాములతో పంచుకోవాలి. ఆండ్రో పాస్ అనేది మగవాళ్ళకు ఒక రకమైన సంది దశ లాంటిది. ఈ సమయంలో భార్య అతడికి సపోర్ట్ ఉండాలి. అతనితో అన్ని పంచుకోవాలి. అతడు మారిపోయాడు అనుకోకుండా.. మారుతున్నాడు అని అర్థం చేసుకోవాలి. ఇది నిజమైన బంధానికి సంకేతం ఇస్తుంది. మగవాళ్ళు చూసేందుకు బలంగా ఉంటారు. కానీ కొన్ని దశల్లో ఆడవాళ్ళ కంటే ఎక్కువ ఎమోషనల్ అవుతుంటారు. మగవాళ్ళు అని సందర్భాలలో కన్నీళ్లు చూపించే అవకాశం ఉండదు. కానీ ఆండ్రో పాజ్ దశలో వారు రోజు ఏడుస్తూనే ఉంటారు. బలంగా ఉన్నానని మగవాళ్ళు బయటికి ఎక్స్పోజ్ అవుతారు. కానీ లోపల నన్ను అర్థం చేసుకునే వారు ఎవరూ లేరని బాధపడుతుంటారు. ఈ దశలో సపోర్టు ఇవ్వాల్సింది కేవలం భార్య మాత్రమే.

Exit mobile version