spot_img
Homeఎంటర్టైన్మెంట్Ram Charan missed Bollywood project: క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్ట్ ని మిస్ చేసుకున్న రామ్...

Ram Charan missed Bollywood project: క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్ట్ ని మిస్ చేసుకున్న రామ్ చరణ్.. ఛాన్స్ కొట్టేసిన ధనుష్..

Ram Charan missed Bollywood project: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) కి కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు , బాలీవుడ్ లో కూడా బోలెడంత క్రేజ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రభాస్ కంటే ముందుగానే రామ్ చరణ్ కి ‘మగధీర’ చిత్రం ద్వారా నేషనల్ వైడ్ గా క్రేజ్ వచ్చింది. ఆ ఫేమ్ కారణంగానే అప్పట్లో బాలీవుడ్ వాళ్ళు రామ్ చరణ్ తో సినిమాలు తీయడానికి క్యూలు కట్టారు. అలా అప్పట్లో అపూర్వ లఖియా దర్శకత్వం లో అమితాబ్ బచ్చన్ కల్ట్ క్లాసిక్ ‘జంజీర్ ‘ ని రీమేక్ చేశారు. తెలుగు లో ఈ చిత్రం ‘తుఫాన్’ పేరుతో విడుదలైంది. రెండు భాషల్లోనూ ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం తో రామ్ చరణ్ మరోసారి హిందీ లో డైరెక్ట్ గా సినిమా చేయడానికి ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు #RRR చిత్రంతో మరోసారి ఆయన బాలీవుడ్ ఆడియన్స్ లోకి దూసుకెళ్లాడు.

దీంతో ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ రామ్ చరణ్ తో పీరియడ్ జానర్ లో ఒక సినిమాని చెయ్యాలని అనుకున్నాడు. జంగిల్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం స్క్రీన్ ప్లే ఉంటుంది. గత ఏడాది రామ్ చరణ్ , సంజయ్ లీలా భన్సాలీ మధ్య రెండు మూడు సార్లు చర్చలు కూడా జరిగాయి. అయితే ఈ ప్రాజెక్ట్ నుండి రామ్ చరణ్ తప్పుకుంటున్నట్టు సోషల్ మీడియా లో బలంగా వినిపిస్తున్న మాట. ఇప్పుడు ఆయన స్థానం లోకి తమిళ హీరో ధనుష్ వచ్చాడట. రామ్ చరణ్ ఈ సినిమా నుండి తప్పుకోవడానికి కారణం , స్టోరీ లో ఆయన సూచించిన కొన్ని మార్పులు చేయడానికి సంజయ్ లీలా భన్సాలీ ఒప్పుకోకపోవడం వల్లే అని తెలుస్తోంది. ఈ విషయాన్నీ తెలుసుకున్నప్పటి నుండి రామ్ చరణ్ అభిమానులు తీవ్రమైన విచారం వ్యక్తం చేస్తున్నారు.

హిందీ ఆడియన్స్ కి ఇంకా బలంగా చేరువయ్యే మార్గాన్ని రామ్ చరణ్ మూసేసాడని అంటున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ లోని ఐటెం సాంగ్ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. రామ్ చరణ్ , శృతి హాసన్ , జాన్వీ కపూర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సాంగ్ షూటింగ్ పూర్తి అయ్యాక , సినిమా మొత్తం పూర్తి కానుంది . జూన్ 25 న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ సినిమా తర్వాత వెంటనే ఆయన సుకుమార్ తో కలిసి ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కూడా ఈ ఏడాదిలోనే మొదలు కాబోతుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version