spot_img
Homeబిజినెస్Vivo Y500s specifications and price: లో బడ్జెట్.. హై ఫీచర్స్.. ఈ వివో కొత్త...

Vivo Y500s specifications and price: లో బడ్జెట్.. హై ఫీచర్స్.. ఈ వివో కొత్త ఫోన్ గురించి తెలుసుకున్నారా..

Vivo Y500s specifications and price: మార్కెట్లో Vivo కంపెనీకి చెందిన ఎన్నో మొబైల్స్ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అయితే కస్టమర్ల అభిరుచులు మారడంతో ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లను తీసుకురావడానికి ఈ కంపెనీ సిద్ధంగా ఉంటుంది. ఇందులో భాగంగా లేటెస్ట్గా ఈ ఏడాది జనవరిలో Vivo Y 500 అనే మొబైల్ ను చైనా మార్కెట్లోకి తీసుకువచ్చింది. త్వరలో ఇది ఇండియాలోకి ప్రవేశం చేయనుంది. అయితే ఇందులో ఉండే ఫీచర్స్ చూసి చాలామంది లైక్ చేస్తున్నారు. ఇప్పటివరకు మార్కెట్లోకి వచ్చిన vivo Y 500 కొనసాగింపుగా దీనిని తీసుకువచ్చారు. ఇంతకీ ఈ మొబైల్ లో ఉండే స్పెషల్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

Vivo Y 500 S అనే మొబైల్ లో 6.75 అంగుళాల LCD స్క్రీన్ ఉండనుంది. ఈ డిస్ప్లేతో మూవీస్ క్లియర్గా చూసేందుకు అవకాశం ఉంటుంది. అలాగే గేమింగ్ కోరుకునే వారికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మొబైల్లో స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 చిప్ సెట్ అమర్చారు. దీంతోపాటు అక్టా కోర్ అడ్రినో సిక్స్ వన్ త్రి జి పి యు ఉన్నాయి. 12gb వరకు రామ్ సపోర్ట్ చేసే ఇందులో యు ఎఫ్ ఎస్ 3.1 స్టోరీ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఓ ఎస్ తో పనిచేసే ఈ మొబైల్ లో 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉంది. అలాగే సెల్ఫీ కోసం 8 ఎంపీ కెమెరాను అమర్చారు. సోషల్ మీడియా కంటెంట్ సృష్టించే వారికి ఈ కెమెరా బాగా సరిపోతుంది.

ఈ కొత్త వివో మొబైల్ లో బ్యాటరీ వ్యవస్థ కూడా మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 7200 mAh బ్యాటరీ ఉండనుంది. ఈ బ్యాటరీ 44 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీంతో రోజు వారి వినియోగదారులకు ఈ బ్యాటరీ బాగా సరిపోతుంది. అలాగే ఇందులో అదనంగా స్టీరియో డ్యూయల్ స్పీకర్లు కూడా ఉన్నాయి. చూడడానికి ఈ మొబైల్స్ స్లిమ్ గా కనిపించడంతోపాటు బరువు కూడా తక్కువగా ఉండడంతో చేతితో పట్టుకునేందుకు అనుగుణంగా ఉంటుంది. అయితే ఇందులో మరో ఫీచర్ ఏంటంటే సెన్సార్ ఫింగర్ ప్రింట్స్. దీంతో సెక్యూరిటీ విషయంలో కూడా ఇది ప్రత్యేకంగా ఇంత ఉంది అని తెలుస్తుంది. దీర్ఘకాలికంగా మొబైల్ ఎక్కువగా నాణ్యతతో ఉండాలని అనుకునే వారికి ఇది బెస్ట్ ఎంపీ కాని అంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version