
దేశంలో కరోనా సెకెండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. ఇప్పటికే ముంబైలో సినిమా షూటింగ్ లు మొదలైపోవడంతో టాలీవుడ్ కూడా హడావుడిగా షూటింగ్ కోసం సెట్ లను కూడా రెడీ చేసుకుంటున్నాయి. అయితే, ఆర్ఆర్ఆర్ మాత్రం ఈ రోజు నుండి షూట్ ను కూడా మొదలు పెట్టింది. రామ్ చరణ్ తిరిగి ‘ఆర్ఆర్ఆర్’ సెట్ లోకి అడుగు పెట్టాడు.
ఈ రోజు షూట్ లో చరణ్ పై కొన్ని సోలో సీన్స్ ను తీయబోతున్నాడు రాజమౌళి. కఠినమైన కోవిడ్ ప్రోటోకాల్ మధ్య షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఇక ముంబైకి చెందిన ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలీమ్ హకీమ్, రామ్ చరణ్ హెయిర్ స్టైల్ కోసం ఆర్ఆర్ఆర్ సెట్ కి వచ్చాడు. ఈ సందర్భంగా హకీమ్ తో చరణ్ దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక ఆర్ఆర్ఆర్ కోసం మిగిలిన స్టార్స్ కూడా డేట్స్ ను ఎడ్జెస్ట్ చేస్తున్నారు. అయితే, బాలీవుడ్ క్యూట్ బేబీ ‘అలియా భట్’ చేతిలో ప్రస్తుతం మూడు భారీ సినిమాలు ఉండటంతో ఆమె ‘ఆర్ఆర్ఆర్’కి డేట్స్ కేటాయించడం సమస్యగా మారింది. అలియా ప్రధాన పాత్రలో మరో క్రేజీ నేషనల్ డైరెక్టర్ సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న ‘గంగూబాయి’ సినిమా కోసం అలియా జులై 29 వరకు డేట్స్ ఇచ్చింది.
ఈ నేపథ్యంలో రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కి అలియా జులై వరకు అందుబాటులో ఉండదు అని తెలుస్తోంది. మరి రాజమౌళి ఏమి చేస్తాడో చూడాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ను మళ్ళీ మొదలుపెట్టాలని రాజమౌళి పట్టుదలతో షూట్ ను స్టార్ట్ చేశాడు. ‘ఆర్ఆర్ఆర్’ను సింగిల్ షెడ్యూల్ లోనే కంప్లీట్ చేయాలనుకుంటున్న రాజమౌళి అనుకున్న డేట్ ప్రకారం షూట్ పూర్తి చేస్తాడా ? లేదా ? అనేది చూడాలి.