Ram Charan Movie: #RRR సినిమా సక్సెస్ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మంచి ఊపు మీద ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ మూవీ తో కేవలం స్టార్ గా మాత్రమే కాదు , నటుడిగా కూడా రామ్ చరణ్ ముందు ఉన్న దానికంటే పది రేట్లు ఎక్కువ ఎదిగాడు అనే చెప్పాలి..ముఖ్యంగా ఉత్తర భారత దేశం లో రామ్ చరణ్ క్రేజ్ ఈ సినిమా తర్వాత అమాంతం పెరిగిపోయింది..ఆయన తదుపరి సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అక్కడి ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు..ప్రస్తుతం ఆయన సౌత్ ఇండియన్ సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ తో ఒక్క సినిమా తీస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇటీవలే అమ్రిత్సర్ లో ఒక్క భారీ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ ని ప్రారంబించుకునేందుకు సిద్ధం అయ్యింది..ఈ సినిమాలో రామ్ చరణ్ IAS ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు.

ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ జెర్సీ సినిమా దర్శకుడు గౌతమ్ తిన్నూరి తో ఒక్క సినిమా చేయబోతున్నాను అని అధికారిక ప్రకటన చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..జెర్సీ సినిమా ని ఎంత అద్భుతంగా తీసిన గౌతమ్ తిన్నూరి వంటి దర్శకుడితో రామ్ చరణ్ సినిమా చెయ్యబోతున్నాడు అని ఆయన అభిమానులు కూడా ఎంతగానో మురిసిపోయారు..ఇది ఇలా ఉండగా గౌతమ్ ఇటీవలే జెర్సీ సినిమాని బాలీవుడ్ లో షాహిద్ కపూర్ తో రీమేక్ చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..బాలీవుడ్ లో ఈ సినిమా తప్పకుండ ప్రభంజనం సృష్టిస్తుంది అని అందరూ అనుకున్నారు..కానీ బాలీవుడ్ ప్రేక్షకుల మూడ్ ప్రస్తుతం మాస్ మసాలా సినిమాల వైపే ఉన్నట్టు అర్థం అవుతుంది..అందుకేనేమో జెర్సీ సినిమాని బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ ఫ్లాప్ ని చేసారు..ఇటీవలే అక్కడి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన సూర్య వంశి, పుష్ప , #RRR మరియు KGF వంటి చిత్రాలు అన్ని యాక్షన్ సినిమాలే..ఇలాంటి సినిమాల మధ్య జెర్సీ సినిమాని విడుదల చెయ్యడమే పెద్ద పొరపాటు అని బాలీవుడ్ ట్రేడ్ వర్గాల అంచనా.
మొదటి రోజు కేవలం మూడు కోట్ల రూపాయిల నెట్ మాత్రమే వసూలు చేసిన ఈ చిత్రం మూడు రోజులకు కలిపి కేవలం 10 కోట్ల రూపాయిలు మాత్రమే వసూలు చేసింది..ఈ సినిమా ఫలితం చూసి ఇప్పుడు రామ్ చరణ్ అభిమానులు భయపడిపోతున్నారు..ఎందుకంటే మొదటి నుండి మాస్ ఇమేజి హీరో ఉన్న రామ్ చరణ్, #RRR సినిమా తో తనకి ఉన్న మాస్ ఇమేజి ని పదింతలు పెంచుకున్నాడు..ఈ సినిమా తర్వాత ఆయన చెయ్యబొయ్యే ఏ సినిమాకి ఆయన అంచనాలు తారాస్థాయిలో ఉండడం సహజం..మగధీర వంటి సెన్సషనల్ హిట్ తర్వాత ఆరెంజ్ లాంటి లవ్ స్టోరీ తీసి అప్పట్లో భారీ ఫ్లాప్ ని అందుకున్నాడు రామ్ చరణ్..మళ్ళీ అలాంటి రసిక చెయ్యొద్దు..గౌతమ్ తో తీసేది క్లాస్ మూవీ వెంటనే క్యాన్సిల్ చేసేయమని ఆయన అభిమానులు రామ్ చరణ్ ని టాగ్ చేస్తూ అభిమానులు వేడుకుంటున్నారు..కానీ గౌతమ్ తో చెయ్యబోతున్న సినిమా క్లాస్ సినిమా కాదు అని..పక్క స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ అని ఆ చిత్ర దర్శకుడు గౌతమ్ ఖరారు చెయ్యడం తో కాస్త ఊపిరి పీల్చుకున్నారు రామ్ చరణ్ ఫాన్స్..మరి ఈ క్రేజీ కాంబినేషన్ నుండి రాబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలి అంటే మరికొన్నేళ్లు ఆగాల్సిందే.