Kodi Rammurthy Naidu: మన టాలీవుడ్ స్టార్ హీరోలలో ఛాలెంజింగ్ రోల్స్ చేసే హీరోలు ఎవరు అనే లిస్ట్ తీస్తే అందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మొదటి వరుస లో ఉంటాడు. రెండవ సినిమా ‘మగధీర’ తోనే ఆయన ఎంతో బరువైన పాత్ర ని మోసి ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తాన్ని తిరగరాశాడు. ఆ తర్వాత వరుసగా కమర్షియల్ మూవీస్ చేసినా ‘రంగస్థలం’ మరియు #RRR చిత్రాలతో చరిత్రలో ఎన్నడూ మర్చిపోని పాత్రలు పోషించి శభాష్ అనిపించుకున్నాడు.
ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన డైరెక్టర్ శంకర్ తో చేస్తున్న ‘గేమ్ చేంజర్’ చిత్రం లో ద్విపాత్రాభినయం చేసి మరోసారి ఛాలెంజింగ్ రోల్ చేసాడు. ఇక ఈ సినిమా తర్వాత ఆయన ఉప్పెన డైరెక్టర్ బుచ్చి బాబు తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్ నెల నుండి ప్రారంభం కాబోతున్న ఈ సినిమా షూటింగ్ గురించి లేటెస్ట్ గా కొన్ని ఎక్సక్లూసివ్ అప్డేట్స్ ఫ్యాన్స్ కి రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తుంది.
ఈ చిత్రం కథ శ్రీకాకుళం కి చెందిన కుస్తీ పోటీదారుడు కోడి రామమూర్తి నాయుడు బయోపిక్ ని ఆధారంగా తీసుకొని సిద్ధం చేసాడట డైరెక్టర్ బుచ్చి బాబు.ఇతని హిస్టరీ చూస్తే మీ రోమాలు నిక్కపొడుచుకుంటాయి. ఇతనిలో ఎంత బలం ఉందో ఉదాహరణగా రెండు సంఘటనలు ఇప్పుడు మీకు చెప్పబోతున్నాము. అందులో ఒకటి ఇతను ఒకసారి తన ఊరిలో అదుపుతప్పిన రైలు ఇంజిన్ ని తన ఒంటి చేతితో ఆపాడు అట. మనిషి తల్చుకుంటే సాధించలేనిది అంటూ ఈ ప్రపంచం లో ఏది లేదు అనడానికి ఈయన ఒక ఉదాహరణ.
అంతే కాదు తన గుండెల మీద ఏనుగు తో తొక్కించుకున్న చరిత్ర కూడా ఈయనకి ఉంది. అలా ఆయనకీ సంబంధించిన ఎన్నో విషయాలను పరిశోధించి ఈ కథని సిద్ధం చేసాడట. అలాంటి కథలో రామ్ చరణ్ నటించబోతున్నాడు అంటే ఇక ఈ చిత్రం ఏ రేంజ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో ఊహించుకోవచ్చు.