Ram Charan: ఒక చేత్తో దానం చేస్తే మరో చేతికి తెలియకూడదు అంటారు పెద్దలు. ఇలాంటి సామెతలు మన టాలీవుడ్ లో కొంతమంది హీరోలకు సరిగ్గా సూట్ అవుతుంది. అలాంటి హీరోలలో ఒకరు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan). తన తండ్రి చిరంజీవి, బాబాయి పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తూ, తనకు తోచినంత సహాయం చేస్తూ ఉండడం రామ్ చరణ్ కి కొత్తేమి కాదు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన ఎన్నో సహాయాలు చేశాడు. కానీ ఆ సహాయాలు గురించి ఎక్కువగా పబ్లిసిటీ చేసుకోడు. ఆయన నుండి సహాయం పొందిన వాళ్ళు చెప్తే తెలియడమే కానీ, తెలిసేటట్టుగా ఇప్పటి వరకు ఆయన ఏ పని చెయ్యలేదు. లేటెస్ట్ గా ఆయన డ్యాన్సర్స్ అసోసియేషన్ కి ఇచ్చిన ఒక మాట ని నిలబెట్టుకొని, తన ఉదార స్వభావాన్ని చాటుకున్నాడు రామ్ చరణ్.
పూర్తి వివరాల్లోకి వెళ్తే గత ఏడాది తన పుట్టినరోజు నాడు రామ్ చరణ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ కి ఉచిత ఆరోగ్య భీమా చేయిస్తానని మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం నేడు ఆయన 500 మంది డ్యాన్సర్లకు 50 లక్షల రూపాయిలు వెచ్చించి ఆరోగ్యా భీమా ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ చేసిన ఈ సహాయం పై సినీ కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాయి. గతం లో కూడా రామ్ చరణ్ డ్యాన్సర్లు అస్సోసియషన్ కోసం ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసాడు. కరోనా సమయం లో వాళ్లకు చిరంజీవి, రామ్ చరణ్ ఇచ్చిన చేయూత సాధారణమైనది కాదు.
ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ‘పెద్ది’ మూవీ చివరి షెడ్యూల్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. నెల రోజుల పాటు సాగనున్న ఈ చివరి షెడ్యూల్ తర్వాత ఒక ఐటెం సాంగ్ ని చిత్రీకరించనున్నారు. ఆ తర్వాత కొన్ని ప్యాచ్ వర్క్స్ ని పూర్తి చేసాక, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని మొదలు పెడతారని, అన్ని పూర్తి అయ్యి మొదటి కాపీ చేతుల్లోకి వచ్చేలోపు మార్చి ఎండింగ్ అవుతుందని అంటున్నారు. ముందుగా ఈ చిత్రాన్ని మార్చి 27 న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ పెండింగ్ వర్క్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడం తో మే నెలలో కానీ, సెప్టెంబర్ నెలలో కానీ ఈ చిత్రాన్ని విడుదల చేద్దామని అనుకుంటున్నారు. AR రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషించాడు.