Chiranjeevi grandson: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో కొనసాగుతున్న నటుడు కూడా తనే కావడం విశేషం…70 సంవత్సరాల వయసులో కూడా యంగ్ హీరోలను సైతం బీట్ చేస్తూ తను చేస్తున్న సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్నాయి. ఇక రీసెంట్ గా ఆయన చేసిన ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు. ఇక తన సినిమా కెరియర్ ని పక్కన పెడితే తన పర్సనల్ లైఫ్ కి వస్తే తన కొడుకు అయిన రామ్ చరణ్ సినిమాల్లో రాణిస్తున్నందుకు గాను చిరంజీవికి చాలా గర్వంగా ఉందని పలు సందర్భాల్లో ఆయన చెబుతుండటం మనం చూస్తూనే వచ్చాము.
ఇక ఇలాంటి క్రమంలోనే తనకు ఒక కొడుకు ఉంటే బాగుండేదని గతంలో చిరంజీవి ఒక ఈవెంట్లో తెలియజేశారు. తన లెగెసిని కంటిన్యూ చేయడానికి వారసుడు వస్తే బాగుంటుందని చిరంజీవి చెప్పడంతో తన అభిమానులు సైతం రామ్ చరణ్ కి ఒక వారసుడు పుట్టాలని కోరుకున్నారు. దాంతో ఎట్టకేలకు నిన్న రామ్ చరణ్ కి వారసుడైతే పుట్టాడు…
ఇక చిరంజీవి ప్రస్తుతం హ్యపీగా ఉన్నాడు. ఇప్పుడు అతనికి మరొక కోరిక ఉందట. చిరంజీవి మనవడు అంటే రామ్ చరణ్ కొడుకుతో కలిసి నటించాలని ఆయనకు ఉందట. చిరంజీవి కొడుకు చైల్డ్ ఆర్టిస్ట్ గా మారిన తర్వాత అతనితో స్క్రీన్ షేర్ చేసుకోవాలని చిరంజీవికి కోరికగా ఉందట.
మరి ఆయన కోరిక నెరవేరాలంటే మరో ఏడెనిమిది సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాలన్నా కూడా అతనికి సినిమాల పట్ల అవగాహన, నటన పట్ల ఆసక్తి, యాక్టింగ్ చేయాలనే కోరిక ఉండాలి. అప్పుడే తను సినిమాలో నటించగలుగుతాడు. కాబట్టి చిరంజీవి మరో ఆరు సంవత్సరాలు వెయిట్ చేసైనా సరే తన మనవడితో నటించడం తన చివరి కొరకని చిరంజీవి చెబుతుండటం విశేషం…