Ram Charan And Sushmita: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కూతురుగా ఇండస్ట్రీ లోని కాస్ట్యూమ్ డిజైనర్ గా అడుగుపెట్టి, ఆ తర్వాత నిర్మాతగా మారి, పలు వెబ్ సిరీస్ లు నిర్మించిన సుష్మిత కొణిదెల(Sushmitha Konidela), తొలిసారి తన సొంత నిర్మాణ సంస్థలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని భారీ లాభాలను మూటగట్టుకుంది. నిర్మాతగా తొలిసినిమాతో ఈ రేంజ్ లాభాలను అందుకోవడం అనేది చిన్న విషయం కాదు. సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసిన సుష్మిత కొణిదెల గురించే మాట్లాడుకుంటున్నారు. పేరుకి మాత్రమే సుష్మిత నిర్మాత, ఆమెకు బదులుగా మొత్తం మెగాస్టార్ చిరంజీవి నే డబ్బులు ఇచ్చి ఉంటాడని చాలా మంది అనుకోవచ్చు. కానీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ సక్సెస్ మీట్ లో మెగాస్టార్ మాట్లాడుతూ, ఈ సినిమా కోసం నా బిడ్డకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు, సగం తన సొంత డబ్బులు ఖర్చుపెట్టుకుంది, సగం అప్పు తీసుకొని వచ్చి పెట్టింది అంటూ చెప్పుకొచ్చాడు.
ఇదంతా పక్కన పెడితే భారీ విజయం సాధించిన తర్వాత, ఆ విజయాన్ని చూసి కుళ్ళుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇష్టమొచ్చినట్టు దిష్టి పెడుతుంటారు. ఇలాంటి సెంటిమెంట్స్ ని బలంగా నమ్మే సుష్మిత సోదరుడు రామ్ చరణ్(Global Star Ram Charan), తన అక్కకు దిష్టి తగలకుండా ఉండడం కోసం ‘ఈవిల్ ఐ’ లాకెట్ చైన్ ను గిఫ్ట్ గా ఇచ్చాడట. నీకు దిష్టి బాగా తగులుతుంది అక్కా, ఈ లాకెట్ ధరించు అని ప్రేమగా ఇచ్చినట్టు సుష్మిత రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. ఈ లాకెట్ ధర లక్షల్లోనే ఉంటుందని సమాచారం. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. దీనిని చూసిన నెటిజెన్స్ రామ్ చరణ్ కి తన అక్క అంటే ఎంత ప్రేమనే చూడండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 18 రోజుల రన్ ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ 18 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 285 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. గత వార్మ్ తో పోలిస్తే ఈ వారం ఈ చిత్రానికి వసూళ్లు బాగా తగ్గాయి, కానీ స్టడీ గా ఉన్నాయి. ఇదే ట్రెండ్ ని కొనసాగిస్తే కచ్చితంగా ఈ చిత్రం ఫుల్ రన్ లో 300 కోట్ల మార్కుని అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. థియేటర్స్ లో విడుదలై ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ ఈ సినిమాకు వస్తున్నటువంటి డీసెంట్ స్థాయి గ్రాస్ వసూళ్లను చూసి ట్రేడ్ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు.