https://oktelugu.com/

Game Changer Teaser : ‘అన్ ప్రెడెక్టబుల్’.. వింటేజ్ శంకర్ సినిమా అంటే ఇదే..కాకరేపుతున్న ‘గేమ్ చేంజర్’ టీజర్..రామ్ చరణ్ నటవిశ్వరూపం!

ఇక్కడ మాత్రమే ఇలాంటి రెస్పాన్స్ వస్తే సరిపోదు, నార్త్ ఇండియా మొత్తం మోత మోగిపోవాలి అంటూ చెప్పుకొచ్చాడు. సంక్రాంతికి యావరేజ్ సినిమాలు కూడా సూపర్ హిట్స్ అవుతాయి. అలాంటి గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ లాగా అనిపిస్తుంది. టీజర్ కి తగ్గట్టు టాక్ వస్తే ఆకాశమే హద్దు అనే రేంజ్ లో వసూళ్లు ఉంటాయి.

Written By:
  • Vicky
  • , Updated On : November 9, 2024 / 06:47 PM IST

    Game Changer Teaser

    Follow us on

    Game Changer Teaser : కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్ ‘ చిత్రం టీజర్ ఎట్టకేలకు కాసేపటి క్రితమే విడుదలైంది. అభిమానుల ఎదురు చూపులకు తగ్గట్టుగానే ఈ టీజర్ వింటేజ్ శంకర్ మార్క్ ఏంటో చూపించింది. రామ్ చరణ్ ని మూడు డిఫరెంట్ లుక్స్ లో చూపించి అభిమానుల చేత ఔరా అనిపించాడు. శంకర్ మార్క్ పాటలకు సంబంధించిన షాట్స్ ని కూడా ఇందులో మనం చూడొచ్చు. అయితే ఈ మూడు గెటప్స్ ని చూసి అభిమానులు ఇందులో రామ్ చరణ్ ట్రిపుల్ రోల్ అని అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి ట్రిపుల్ రోల్ కాదు. డ్యూయల్ రోల్ మాత్రమే. పంచె కట్టు లో ఉన్న క్యారక్టర్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రామ్ చరణ్ తండ్రి క్యారక్టర్. ఇక మోడరన్ లుక్ లో, పొడవాటి జుట్టుతో ఉన్న క్యారక్టర్ స్టూడెంట్ రోల్.

    ఇందులో మోడరన్ క్యారక్టర్ లో రామ్ చరణ్ కి విపరీతమైన కోపం ఉందనే విషయం టీజర్ ని చూస్తేనే అర్థం అవుతుంది. షాట్స్ అన్ని అదిరిపోయాయి కానీ, థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ మూవీ గ్లిమ్స్ కి థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ రేంజ్ స్టాండర్డ్స్ ని చూసి ‘గేమ్ చేంజర్’ టీజర్ చూస్తే పర్వాలేదు అనే రేంజ్ లో మాత్రమే ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒక్కటి సరిచేసుకొని ఉండుంటే ఈ టీజర్ ఇంకా వేరే లెవెల్ లో ఉండేది. క్వాలిటీ మాత్రం నిర్మాత దిల్ రాజు ఎక్కడా కూడా తగ్గినట్టు అనిపించలేదు. శంకర్ ఏది కోరితే అది ఇచ్చినట్టు గా అనిపించింది. ఓవరాల్ గా చాలా కాలం తర్వాత శంకర్ నుండి వస్తున్న పూర్తి స్థాయి కమర్షియల్ సినిమాగా ‘గేమ్ చేంజర్’ ఉండబోతుందని టీజర్ ని చూస్తే అర్థం అవుతుంది.

    ఇకపోతే ఈ టీజర్ ని నేడు థియేటర్స్ లో ప్లే చేయగా అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమా విడుదలైతే ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో, నేడు థియేటర్స్ దగ్గర అభిమానుల కోలాహలం చూస్తే అలా అనిపించింది. ముఖ్యంగా లక్నో లో రామ్ చరణ్ కి అద్భుతమైన స్వాగతం పలికారు అక్కడి జనాలు. అక్కడ అభిమానుల రెస్పాన్స్ ని చూసిన రామ్ చరణ్, ఇక్కడ మాత్రమే ఇలాంటి రెస్పాన్స్ వస్తే సరిపోదు, నార్త్ ఇండియా మొత్తం మోత మోగిపోవాలి అంటూ చెప్పుకొచ్చాడు. సంక్రాంతికి యావరేజ్ సినిమాలు కూడా సూపర్ హిట్స్ అవుతాయి. అలాంటి గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ లాగా అనిపిస్తుంది. టీజర్ కి తగ్గట్టు టాక్ వస్తే ఆకాశమే హద్దు అనే రేంజ్ లో వసూళ్లు ఉంటాయి.