https://oktelugu.com/

Game Changer Twitter Talk: ఆశ్చర్యపరుస్తున్న ‘గేమ్ చేంజర్’ ట్విట్టర్ టాక్..సెకండ్ హాఫ్ ఈ రేంజ్ లో ఉందా..!

సినిమా ఎలా ఉంటుందో ఏంటో అని కంగారు పడిన విషయం వాస్తవమే. మరి శంకర్ వాళ్ళు భయపడినట్టే ఈ సినిమాని ఇండియన్ 2 రేంజ్ లో తీసాడా?, లేకపోతే కం బ్యాక్ ఇచ్చి తన సత్తా చాటాడా అనేది ట్విట్టర్ జనాలు దీని గురించి ఏమి మాట్లాడుకుంటున్నారో చూద్దాం.

Written By:
  • Vicky
  • , Updated On : January 10, 2025 / 08:19 AM IST

    Game Changer Twitter Talk

    Follow us on

    Game Changer Twitter Talk: బల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం ఈరోజు భారీ అంచనాల నడుమ విడుదలైంది. దాదాపుగా మూడేళ్ళ పాటు రామ్ చరణ్ ఎంతో కష్టపడి, డైరెక్టర్ శంకర్ ని నమ్మి చేసిన చిత్రమిది. #RRR తర్వాత విడుదల అవ్వబోతున్న రామ్ చరణ్ సినిమా కావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూసారు. అర్థ రాత్రి ఒంటిగంట నుండి రెండు ఆంధ్ర ప్రదేశ్ బెనిఫిట్ షోస్ మొదలయ్యాయి. శంకర్ గత చిత్రం ఇండియన్ 2 మిగిలించిన చేదు జ్ఞాపకాలను దృష్టిలో పెట్టుకొని కొంతమంది ఆడియన్స్ కాస్త భయపడ్డారు. సినిమా ఎలా ఉంటుందో ఏంటో అని కంగారు పడిన విషయం వాస్తవమే. మరి శంకర్ వాళ్ళు భయపడినట్టే ఈ సినిమాని ఇండియన్ 2 రేంజ్ లో తీసాడా?, లేకపోతే కం బ్యాక్ ఇచ్చి తన సత్తా చాటాడా అనేది ట్విట్టర్ జనాలు దీని గురించి ఏమి మాట్లాడుకుంటున్నారో చూద్దాం.

    సినిమా ప్రారంభమైన మొదటి 20 నిమిషాలు చాలా ఫాస్ట్ స్క్రీన్ ప్లేతో, మంచి బిల్డప్ షాట్స్ తో అద్భుతంగా తీసిన ఫీలింగ్ ఆడియన్స్ కి కలుగుతుంది. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సన్నివేశాలు కూడా బాగానే ఉన్నాయి కానీ, రామ్ చరణ్ – కైరా అద్వానీ మధ్య వచ్చే లవ్ ట్రాక్ కాస్త బోర్ ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు అదిరిపోతోంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఎవ్వరూ ఊహించని విధంగానే ఉంటుంది. ప్రేక్షకులను సర్ప్రైజ్ కి గురి చేస్తుంది. ఫస్ట్ హాఫ్ లో సాంగ్స్ చాలా గ్రాండ్ గా తీశారు. ‘రా మచ్చ మచ్చ’, ‘డోప్’ సాంగ్స్ వెండితెర మీద అద్భుతంగా అనిపించాయి. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ యావరేజ్ నుండి ఎబోవ్ యావరేజ్ అని అంటున్నారు ట్విట్టర్ ప్రజానీకం.

    ఇక సెకండ్ హాఫ్ విషయానికి ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ అప్పన్న క్యారక్టర్ లో జీవించేసాడు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. రంగస్థలం లోని చిట్టి బాబు క్యారక్టర్ ఆయనకీ ఎంత గొప్ప పేరు తెచ్చిందో ‘గేమ్ చేంజర్’ లోని ఆపన్న క్యారక్టర్ అలా రామ్ చరణ్ కెరీర్ లో చిరస్థాయిగా మిగిలిపోతుంది. సెకండ్ హాఫ్ మొదలైన 40 నిమిషాలు వింటేజ్ శంకర్ తో రామ్ చరణ్ పోటీ పడి నటించినట్టు అనిపించింది. ఇక ఆ తర్వాత సన్నివేశాలు మొత్తం ఊహించినట్టు గానే ఉన్నాయని, ఓవరాల్ గా చూసుకుంటే వింటేజ్ శంకర్ కం బ్యాక్ అని చెప్పలేం కానీ, డీసెంట్ శంకర్ కం బ్యాక్ అని మాత్రం చెప్పొచ్చు. ట్విట్టర్ లో ఓవరాల్ గా ఈ చిత్రం యావరేజ్ నుండి ఎబోవ్ యావరేజ్ టాక్ దగ్గర ఆగింది. ఈరోజు షోస్ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్లి స్థిరపడుతుందో చూడాలి.