https://oktelugu.com/

Game Changer Trailer: ‘గేమ్ చేంజర్’ ట్రైలర్ లో మీరెవ్వరు గమనించిన ఆసక్తికరమైన విషయాలు ఇవే..శంకర్ లో ఈ రేంజ్ మాస్ ఉందా!

ట్రైలర్ లోని డైలాగ్స్ నేటి రాజకీయ పరిస్థితులకు చాలా దగ్గరగా ఉంది. వంద ముద్దలు తినే ఏనుగు, ఒక్క ముద్ద వదిలేస్తే వచ్చే నష్టం లేదు, కానీ ఆ ఒక్క ముద్ద కొన్ని లక్షల చీమలకు ఆహరం అవుతుంది అని ట్రైలర్ ప్రారంభం లో రామ్ చరణ్ చెప్పే డైలాగ్, ఆంధ్ర ప్రదేశ్ లోని గత ఐదేళ్ల రాజకీయాలను ఉద్దేశించి రాసినట్టు అనిపిస్తుంది.

Written By:
  • Vicky
  • , Updated On : January 2, 2025 / 06:34 PM IST

    Game Changer Trailer(1)

    Follow us on

    Game Changer Trailer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ చిత్రం మరో 8 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా, కాసేపటి క్రితమే ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేసింది మూవీ టీం. హైదరాబాద్ లోని గచ్చిబౌలి ప్రాంతం లో ఉన్నటువంటి AMB సినిమాస్ లో ఈ లాంచ్ ఈవెంట్ జరగగా, డైరెక్టర్ రాజమౌళి స్పెషల్ గెస్ట్ గా విచ్చేశాడు. సంధ్య థియేటర్ ఘటనని దృష్టిలో పెట్టుకొని ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు ఈ ఈవెంట్ ని చాలా ప్రశాంతవంతమైన వాతావరణం లో జరిపించాడు. కేవలం టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే అనుమతిని ఇచ్చేలా చేసాడు. మీడియా రిపోర్టర్స్ కి కూడా టికెట్ ఉంటేనే లోపలకు ఎంట్రీ. అలా చాలా క్లీన్ గా ఈ ఈవెంట్ ని మ్యానేజ్ చేసి సక్సెస్ అయ్యాడు దిల్ రాజు. ఈ ట్రైలర్ లో మీరెవ్వరు గమనించని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం చూడబోతున్నాము.

    ట్రైలర్ లోని డైలాగ్స్ నేటి రాజకీయ పరిస్థితులకు చాలా దగ్గరగా ఉంది. వంద ముద్దలు తినే ఏనుగు, ఒక్క ముద్ద వదిలేస్తే వచ్చే నష్టం లేదు, కానీ ఆ ఒక్క ముద్ద కొన్ని లక్షల చీమలకు ఆహరం అవుతుంది అని ట్రైలర్ ప్రారంభం లో రామ్ చరణ్ చెప్పే డైలాగ్, ఆంధ్ర ప్రదేశ్ లోని గత ఐదేళ్ల రాజకీయాలను ఉద్దేశించి రాసినట్టు అనిపిస్తుంది. అంతే కాకుండా ప్రభుత్వ అధికారి పవర్ ముందు ఏ రాజకీయ నాయకుడైన చిన్నవాడే అని ఈ సినిమాలోని హీరో క్యారక్టర్ తో చెప్పించాడు డైరెక్టర్. ‘నువ్వు కేవలం ఐదేళ్లు మాత్రమే మంత్రివి..కానీ చనిపోయేవరకు IAS ఆఫీసర్’ అంటూ రామ్ చరణ్ చెప్పే డైలాగ్ అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంతే కాకుండా ఈ ట్రైలర్ లో రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ గా, కాలేజీ స్టూడెంట్ గా, రాజకీయ నాయకుడిగా కనిపించాడు.

    ఇదంతా పక్కన పెడితే ట్రైలర్ చివర్లో రామ్ చరణ్ హెలికాప్టర్ నుండి కత్తి పట్టుకొని దూకిన సన్నివేశం ఇంటర్వెల్ ఎపిసోడ్ అని తెలుస్తుంది. అదే విధంగా తెల్లని గుర్రం మీద హీరో స్వారీ చేసిన షాట్స్, అదే విధంగా నీళ్లలో ఒక పక్క గుర్రం, మరో పక్క హీరో పరుగులు తీస్తున్న షాట్ ‘నానా హైరానా’ పాటలోని షాట్స్ గా మనం గమనించొచ్చు. సినిమా మొత్తానికి రామ్ చరణ్ అప్పన్న క్యారక్టర్ చాలా హైలైట్ గా ఉండబోతుందని స్పష్టంగా తెలుస్తుంది. సెంటిమెంట్ సన్నివేశాలు వింటేజ్ శంకర్ మార్క్ లోనూ, అలాగే యాక్షన్ సన్నివేశాలు వింటేజ్ బోయపాటి శ్రీను మార్క్ లో ఉన్నట్టుగా అనిపించింది. ఓవరాల్ గా ట్రైలర్ ని చూస్తే రామ్ చరణ్ నటవిశ్వరూపం చూపించినట్టే అనిపిస్తుంది. థియేటర్స్ లో ఈ చిత్రం ట్రైలర్ రేంజ్ లోనే ఉంటుందా లేదా అనేది చూడాలి.