https://oktelugu.com/

Game Changer Trailer: గేమ్ చేంజర్ ట్రైలర్ రివ్యూ :ఏపీ రాజకీయాలనే రాంచరణ్ గురిపెట్టాడా? పవన్ మేనియా కనిపిస్తోందిగా..

తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతున్న సమయాన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంటి నటుడు సైతం వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకొని ముందుకు సాగుతూ ఉండడం విశేషం... ఇక ఇంతకుముందు ఎన్టీఆర్ తో కలిసి 'త్రిబుల్ ఆర్' సినిమాలో నటించి మెప్పించిన ఆయన గ్లోబల్ స్టార్ గా అవతారం ఎత్తాడు.

Written By:
  • Gopi
  • , Updated On : January 2, 2025 / 06:43 PM IST

    Game Changer Trailer(2)

    Follow us on

    ఇక రామ్ చరణ్ కెరియర్ లో ఎన్ని సక్సెస్ లు అందుకున్న కూడా త్రిబుల్ ఆర్ సినిమా ఇచ్చిన సక్సెస్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి…మరి ఈ సినిమా అందించిన సక్సెస్ తో రామ్ చరణ్ శంకర్ తో చేస్తున్న ‘గేమ్ చేంజర్’ సినిమా మీద ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది…ఇక గత కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా నుంచి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. మరి ఈ ట్రైలర్ ను కనక మనం అబ్జర్వ్ చేసినట్లైతే ఇందులో శంకర్ చాలా డీటైలింగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రామ్ చరణ్ ఈ సినిమాలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఉండి ఆ తర్వాత పొలిటిషన్ గా కూడా మారబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక పొలిటికల్ సెటైరికల్ గా మూవీగా వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక వాళ్ల బాబాయ్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరుపున పోరాటం చేసి మొత్తానికైతే ఏపీ లో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఏపీలో డిప్యూటీ సీఎం తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న నేపధ్యంలో రామ్ చరణ్ కూడా పొలిటికల్ గేమ్ చేంజర్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నాడనేది ఈ ట్రైలర్ ను చూస్తే మనకు ఈజీగా అర్థమైపోతుంది… ఇక ట్రైలర్ మొదట్లో ‘100 ముద్దులు తినే ఏనుగు ఒక్క ముద్దను వదిలేసిన అది లక్ష చీమలకు ఆహారం అవుతుంది’ అనే డైలాగు మీదనే ఈ సినిమా మొత్తాన్ని నడిపించినట్టుగా తెలుస్తోంది… అంటే ప్రజల సొమ్ము దోచుకునే రాజకీయ నాయకులు ప్రజలకు కొంత హెల్ప్ చేసిన వాళ్ల జీవితాలు బాగుపడతాయి అనేదే ఈ సినిమా లైన్ గా తెలుస్తోంది…ఇక ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రామ్ చరణ్ వైఫ్ గా అంజలి నటించింది. తన పాత్రకి కూడా ఇందులో చాలా ఇంపార్టెన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. కొన్ని కీలకమైన విషయాల్లో రామ్ చరణ్ తీసుకునే నిర్ణయాల పట్ల ఆమె కూడా అందులో భాగం కాబోతున్నట్టుగా కనిపిస్తుంది…ఇక ముఖ్యంగా ఈ సినిమాలో ఎస్ జె సూర్య, రామ్ చరణ్ మధ్య వచ్చే సీన్లు చాలా హైలెట్ గా నిలవబోతున్నాయి. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ అయితే నడిచినట్టుగా తెలుస్తోంది.

    ఇక ఎస్ జె సూర్య ముఖ్యమంత్రి అయిన తర్వాత రామ్ చరణ్ ను ఎలాంటి ఇబ్బందులకు గురి చేశాడు. సినిమాలో హీరో ఎదుర్కొనే క్రైసిస్ ఏంటి అనేది తెలియాల్సి ఉంది… ఇక యాక్షన్ ఎపిసోడ్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. శంకర్ తన ఊహలకు విజువల్స్ తో ఒక రూపాన్ని అందించినట్టుగా కనిపిస్తున్నాయి… ఇక హీరోయిన్ కైరా అద్వానీ కి ఈ సినిమాలో పెద్దగా ఇంపార్టెన్స్ పాత్ర అయితే లేనట్టుగా తెలుస్తుంది. సునీల్ కూడా ఏదో కామెడీ వర్కౌట్ చేసినట్టుగా కనిపిస్తుంది. కానీ అది ట్రైలర్ అయితే పెద్దగా పండలేదు. ఇక వెన్నెల కిషోర్ కామెడీ కూడా అంతమాత్రంగానే ఉంది కాబట్టి కామెడీ అనేది ట్రైలర్లో పెద్ద గా ఎస్టాబ్లిష్ చేయలేదు..

    మరి సినిమా మొత్తం లో కామెడీ సినిమాకి అడ్డుగా మారాబోతుందా లేదంటే ఒక పొలిటికల్ హీట్ లో వెళ్తున్న సినిమాకి వీళ్ళ కామెడీ కాస్త ఆనందాన్ని ఇచ్చి ప్రేక్షకుడిని మెప్పించగలుగుతుందా అనేది తెలియాల్సి ఉంది. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా తమన్ చాలా కీలక పాత్రను వహించినట్టుగా తెలుస్తోంది… ఇక కార్తీక్ సుబ్బరాజు అందించిన ఈ కథను శంకర్ చాలా ఓన్ చేసుకొని తెరకెక్కించాడనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది… ఇక ట్రైలర్ కట్ బాగున్నప్పటికి అక్కడక్కడ కథను చెప్పడంలో మాత్రం కొంచెం ట్రైలర్ వీక్ గా అనిపించినట్టు తెలుస్టింది. ఎందుకంటే ట్రైలర్లో కథ మొత్తాన్ని రివిల్ చేసి ప్రేక్షకుడిని థియేటర్ కి రప్పించాలని ప్రయత్నం చేసిన శంకర్ ఆ కథని సినిమా మేజర్ కాన్సెప్ట్ ను చెప్పకుండా ఉంచితే బాగుండేది.

    ఎందుకంటే మేజర్ హుక్కు పాయింట్ ను హోల్డ్ చేసి పెట్టుకుంటే బాగుండేది. ఇప్పుడు కథ మొత్తం ఓపెన్ అయిపోవడం వల్ల సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుడికి కథలోని సీన్స్ ను ఈజీగా ఎస్టిమేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అలాంటప్పుడు శంకర్ స్క్రీన్ ప్లే ని చాలా అద్భుతంగా రాసుకొని ఉండాలి. లేకపోతే మాత్రం ట్రైలర్ చూసిన ప్రతి ప్రేక్షకుడు సినిమాలో వచ్చే ప్రతి సీన్ ను ముందుగానే ఎక్స్ పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కథను ట్రైలర్o ముందే రివీల్ చేస్తే స్క్రీన్ ప్లే తో ప్రేక్షకుడిని హుక్ చేసే ప్రయత్నం చేయాలి. మరి శంకర్ అలాంటి ప్రయత్నం చేశాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక భారతీయుడు 2 సినిమాలో స్క్రీన్ ప్లే ప్రకారం శంకర్ చాలా పేలవమైన స్క్రీన్ ప్లే రాశాడనే చెప్పాలి. మరి ఇక్కడ మాత్రం ఆయన రాసిన స్క్రీన్ ప్లే వర్కౌట్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే జనవరి 10వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే…