https://oktelugu.com/

Game Changer Teaser : ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన గేమ్ చేంజర్ టీజర్…ఇలా అయితే కష్టమే…

ఒక సినిమా అనేది ప్రేక్షకుడిలో ఎంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందనేది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఒక ప్రేక్షకుడు సగటు సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చేస్తుంటాడు... ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తాను చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న చాలామంది హీరోలు వాళ్ళ ఫ్యాన్స్ ని అలరించడానికి చాలా వరకు మంచి సినిమాలు చేస్తూ ముందుకెళ్తూ ఉంటారు. మరి ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాలు కూడా ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాయి...

Written By:
  • Gopi
  • , Updated On : November 9, 2024 / 07:32 PM IST

    Game Changer Teaser

    Follow us on

    Game Changer Teaser : రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ‘గేమ్ చేంజర్’ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా మీద హైప్ ని పెంచే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక అందులో భాగంగా ఈ సినిమా నుంచి ఇంతకుముందే టీజర్ రిలీజ్ అయింది. అయితే ఈ టీజర్ ని చూసిన చాలా మంది సినిమా మీద కొన్ని కామెంట్లు అయితే చేస్తున్నారు. నిజానికి ఈ టీజర్ ప్రేక్షకుడిని ఏమాత్రం మెప్పించే విధంగా అయితే కనిపించడం లేదు.
    ఎంతసేపు యాక్షన్ ఎపిసోడ్స్ ని చూపించే ప్రయత్నం చేశారు. కానీ సినిమాలోని కథని కొంచమైనా ఎలివేట్ చేసే ప్రయత్నం అయితే అసలు చేయలేదు. ముఖ్యంగా రామ్ చరణ్ ఇలాంటి ఫైట్స్ ని చేశాడు ఆయన ఎలా ఈ సినిమాలో కనిపించబోతున్నాడనే దాని మీదనే దృష్టి పెట్టారు తప్ప టీజర్ కట్ లో మినిమం సినిమాకు సంబంధించిన ఒక్క క్లూ ని కూడా వదలకుండా శంకర్ కొంతవరకు స్టోరీని హోల్డ్ చేసి పెట్టారు.

    ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఒక కమర్షియల్ సినిమాకి ఏ లెవెల్లో అయితే బజ్ రావాలో ఈ టీజర్ చూసిన తర్వాత ప్రేక్షకుల్లో ఆ మేరకు అయితే రావడం లేదు. శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ తెరకెక్కించే సినిమాలు ఎంత గ్రాండియర్ గా ఉంటాయో మనందరికీ తెలిసిందే.

    ఇక ఈ సినిమాలో గ్రాండియర్ విజువల్స్ ఉన్నప్పటికి కథ ఎలా ఉంది. దాన్ని ఎలా హోల్డ్ చేసి ముందుకు తీసుకెళుతున్నారు అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. మరి శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ ఇలాంటి ఒక నాసిరకం టీజర్ ని ఎందుకు రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో ఏముంది. రామ్ చరణ్ తగ్గ కథ ఈ సినిమాలో ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

    ఇక ఈ సినిమా ఒక కథ కథనం దర్శకత్వం మీదనే మీ సినిమా చాలావరకు ఆధారపడి ఉంది.ఇక శంకర్ డైరెక్షన్ లో ఇంతకు ముందు వచ్చిన ‘భారతీయుడు 2’ సినిమాతో భారీ ఫ్లాప్ ని మూట గట్టుకున్నాడు. ఆ తర్వాత ఆయనకి మార్కెట్ పరంగా చూసుకుంటే భారీగా డౌన్ అయిపోయిందనే చెప్పాలి. రామ్ చరణ్ ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యతను కూడా తన భుజాల మీదే మోస్తున్నట్టుగా తెలుస్తుంది…