
Ram Charan ‘Game Changer’ : ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ఎంతగానో ఎదురు చూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఒకటి రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ‘గేమ్ చేంజర్’.మొన్నీమధ్యనే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు కాన్సెప్ట్ వీడియో ని విడుదల చెయ్యగా , దానికి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు దిల్ రాజు నేడు ఒక శుభవార్త తెలిపాడు.ఆయన నిర్మాణం లో తెరకెక్కిన ‘శాకుంతలం’ అనే చిత్రం ఈ నెల 14 వ తేదీన విడుదల కాబోతుంది.ఈ సందర్భంగా దిల్ రాజు నేడు ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసాడు.ఈ ప్రెస్ మీట్ లో విలేఖరులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాడు, అందులో ‘గేమ్ చేంజర్’ కి సంబంధించిన ప్రశ్నలు కూడా ఉన్నాయి.
గేమ్ చేంజర్ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుంది అని అడిగిన ప్రశ్నకి దిల్ రాజు సమాధానం చెప్తూ ‘ఇప్పటి వరకు ఈ సినిమా షూటింగ్ 70 శాతం కి పైగా పూర్తి అయ్యింది.సంక్రాంతి కానుకగా విడుదల చేద్దామని అనుకుంటున్నాము, కానీ వంద శాతం పూర్తి అయితే కానీ అధికారికంగా ప్రకటించకూడదు అనుకున్నాము, ఒక్కసారి సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అవ్వగానే డేట్ ప్రకటిస్తాము’ అంటూ చెప్పుకొచ్చాడు దిల్ రాజు.
ఈ చిత్రం లో బాలీవుడ్ నటి కైరా అద్వానీ హీరోయిన్ గా నటించగా శ్రీకాంత్ , SJ సూర్య , సునీల్ , అంజలి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.రామ్ చరణ్ ద్విపాత్రాభినయం లో నటిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఇప్పటికే సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తారీఖున మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా రాబోతుంది.ఇక జనవరి 12 వ తేదీన ‘గేమ్ చేంజర్’ ని విడుదల చెయ్యాలని చూస్తున్నారు.