Ram Charan New Movie Update 2026: మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీకి వచ్చిన రామ్ చరణ్ ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుతున్నాడు. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని సైతం శాసించే స్థాయిలో ఆయన ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇకమీదట నుంచి రాబోయే సినిమాలు పెను ప్రభంజనాలను సృష్టించే విధంగా ఉండబోతున్నాయి అంటూ ఆయన చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్లో చేసిన ‘పెద్ది’ సినిమా ఏప్రిల్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా విషయంలో కూడా ఆయన చాలా క్లారిటీని మెయింటైన్ చేస్తున్నాడు. ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుంది అంటూ ఆయన చెబుతుండడం విశేషం… ఇక దీంతోపాటుగా మరికొన్ని సినిమాలకు కూడా కమిట్ అయ్యాడు.
సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఇప్పటికే సన్నాహాలు చేస్తున్న ఆయన తొందర్లోనే ఈ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రాజశేఖర్ కీలకపాత్రలో నటిస్తున్నాడనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. రామ్ చరణ్ ఫాదర్ క్యారెక్టర్ లో రాజశేఖర్ నటిస్తున్నాడట.
ఆయన క్యారెక్టర్ సైతం చాలా వైల్డ్ గా ఉంటుందట. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఆయనకంటూ ఒక హీరోయిజం ఎలివేట్ అయ్యేలా కొన్ని సీన్స్ ఉంటాయట. అలాంటి క్యారెక్టర్ లో రాజశేఖర్ మరోసారి తన సత్తా ఎలా చాటుతాడు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించే స్థాయిలో తన యాక్టింగ్ ఉంటుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్ ని అదరగొట్టడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు.
శర్వానంద్ హీరోగా వస్తున్న ‘బైకర్’ సినిమాలో శర్వానంద్ కోచ్ గా రాజశేఖర్ నటిస్తున్నాడు. మొత్తానికైతే ఈ సినిమా వల్ల ఆయన చాలా మంచి గుర్తింపును తెచ్చుకోబోతున్నాడట… ఈ సినిమా సక్సెస్ అయితే మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయనకు మంచి డిమాండ్ ఏర్పడుతుంది. అలా ఆయన చాలా బిజీ ఆర్టిస్ట్ గా మారిపోతాడనే చెప్పాలి…
