Producer Sireesh apology : నిర్మాత దిల్ రాజు(Dil Raju) సోదరుడు శిరీష్(Sireesh) ‘గేమ్ చేంజర్'(Game Changer) చిత్రం ఫలితం గురించి రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో రామ్ చరణ్ పై చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. అభిమానుల ఆవేశం కట్టలు తెంచుకుంది. సోషల్ మీడియా లో దిల్ రాజు బ్రదర్స్ ని ఏకిపారేశారు. విషయం వాళ్ళిద్దరి వరకు చేరడంతో వెంటనే శిరీష్ నిన్న సాయంత్రం క్షమాపణలు చెప్తూ ఒక లేఖ ని విడుదల చేశారు. ఇది సరిపోలేదని అనుకున్నారో ఏమో తెలియదు కానీ, కాసేపటి క్రితమే మరోసారి వీడియో చేస్తూ అభిమానులకు క్షమాపణలు తెలియచేసాడు.
ఆయన మాట్లాడుతూ ‘మా సంస్థకి,రామ్ చరణ్ గారికి, చిరంజీవి గారికి మధ్య ఎంతో మంచి సాన్నిహిత్య సంబంధం ఉంది. నేను విపరీతంగా అభిమానించే హీరోలలో ఒకరు రామ్ చరణ్. ఆయన్ని అవమానపర్చడం కానీ,కించ పరచడం కానీ, నా జన్మలో నేనెప్పుడూ చెయ్యను. నేను ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన గురించి చిన్న మాట దొర్లినా అది నా తప్పే, అది జరిగిందని అభిమానులు అనుకుంటున్నారు కాబట్టి వాళ్లకు క్షమాపణలు చెప్తున్నాను. రామ్ చరణ్ గారికి కూడా క్షమాపణలు చెప్తున్నాను. నాకు వాళ్ళతో ఉన్న అనుబంధాన్ని పాడు చేసుకోవాలని కోరుకోవడం లేదు. ఎందుకంటే ఈరోజు జనం మాట్లాడుతున్న మాటలు కానీ,ట్రోలింగ్స్ ని కానీ, వాళ్ళ బాధలను కానీ నేను అర్థం చేసుకోగలను. ఒక హీరో గురించి అలా మాట్లాడితే అభిమానులకు బాధ ఉంటుంది, అందులో ఎలాంటి తప్పు లేదు. నాకు వాళ్ళతో ఉన్న రిలేషన్ కారణంగా ఒక మాట జారి ఉండొచ్చు’.
అంతే కానీ ఆయన్ని అవమానించడం నా ఉద్దేశ్యం కాదు. మెగా హీరోలందరితో మాకు మంచి అనుబంధం ఉంది. వరుణ్ తేజ్ తో ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ చేసాము, సాయి ధరమ్ తేజ్ తో రెండు సూపర్ హిట్స్ తీసాము, రామ్ చరణ్ తో రెండు సినిమాలు చేసాము, చిరంజీవి గారు మాతో రెగ్యులర్ గా మాట్లాడుతూనే ఉంటారు. అలాంటి వ్యక్తుల గురించి తప్పుగా మాట్లాడేంత దుర్మార్గులం కాదు మేము. ‘గేమ్ చేంజర్’ విడుదల సమయం లో మా సంక్రాంతి వస్తున్నాం చిత్రాన్ని కూడా విడుదల చేసుకుంటామని రామ్ చరణ్ గారిని అడిగితే, పాపం చాలా బడ్జెట్ పెట్టారు కదా,డబ్బులు కలిసి వస్తాయి వాళ్లకు అని మా గురించి అలోచించి ‘సంక్రాంతికి వస్తున్నాం’ విడుదలకు ఒప్పుకున్న గొప్ప మనసున్న వ్యక్తి ఆయన. ఆయన చేయొద్దు అని చెప్పి ఉంటే ఆరోజు సంక్రాంతికి వస్తున్నాం విడుదల అయ్యేది కాదు. అలాంటి వ్యక్తిని మేము ఎందుకు అవమానిస్తాము. అభిమానులారా దయచేసి క్షమించండి. మా మధ్య రిలేషన్ ని చెడగొట్టకండి. రీసెంట్ గానే మా బ్యానర్ లో మరో ప్రాజెక్ట్ రామ్ చరణ్ గారితో సిద్ధమైంది’ అంటూ చెప్పుకొచ్చాడు శిరీష్.
Official statement from our Producer Shirish Garu. pic.twitter.com/I4mv9r18w7
— Sri Venkateswara Creations (@SVC_official) July 2, 2025