https://oktelugu.com/

Ram Charan : వైజాగ్ బీచ్ లో కూతురు తో కలిసి ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్.. వీడియో వైరల్…

ఇక ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న రామ్ చరణ్ ఈ సినిమా షూటింగ్ తొందర్లోనే కంప్లీట్ చేసి సినిమాని రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇది అయిపోయిన వెంటనే బుచ్చిబాబు డైరెక్షన్ లో వచ్చే సినిమా మీద తన ఫోకస్ ని పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది...

Written By:
  • NARESH
  • , Updated On : March 19, 2024 / 10:20 PM IST

    Ram Charan enjoying with daughter in Vizag beach.. Video viral...

    Follow us on

    Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఏది చేసిన చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మొదటి నుంచి కూడా ఆయన శైలి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక రీసెంట్ గా ఆయన గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ కోసం వైజాగ్ వెళ్లిన విషయం మనకు తెలిసిందే…ఇక ఆయన్ని చూడడానికి వచ్చిన జనం తో వైజాగ్ రోడ్లు మొత్తం బ్లాక్ అయిపోయాయి..రామ్ చరణ్ క్రేజ్ అంటే అలా ఉంటుంది…

    ఇక ఇది ఇలా ఉంటే ఆ షూటింగ్ సమయంలో కూడా తన కూతురుని ఎక్కడ మిస్ అవుతానో అనే ఉద్దేశంతో తనతో పాటే తన భార్య అయిన ఉపాసనని కూతురు ‘క్లింకార ‘ ను కూడా తీసుకెళ్లాడు. ఇక షూటింగ్ అయిపోయిన వెంటనే వైజాగ్ బీచ్ లో క్లింకార తో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ గడిపిన ఆ క్షణాల్ని అభిమానులతో పంచుకోవాలని ఉద్దేశంతో వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.ఇక ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక రామ్ చరణ్ వర్క్ పట్ల ఎంత డెడికేషన్ తో ఉంటాడో, ఫ్యామిలీ పట్ల అంతే కేరింగ్ తో ఉంటాడు. ముఖ్యంగా ఆయన తండ్రి అయినప్పటి నుంచి ఆయన షూటింగ్ టైమింగ్స్ లో చాలా డిఫరెన్సెస్ వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది.

    ఎంతసేపు తనకి షూటింగ్ ఉంటుందో అంతే టైమ్ సెట్ లో గడిపేసి, అది అయిపోయిన వెంటనే ఇంటికి వచ్చేసి క్లింకార తో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఆయన ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఇక అందులో భాగంగానే క్లింకార ను ఎక్కడ మిస్ అవుతానో అనే ఉద్దేశ్యం తో తనతో పాటు వైజాగ్ తీసుకెళ్లాడు అంటేనే మనకు అర్థమవుతుంది. తన కూతురిని వదిలిపెట్టి రామ్ చరణ్ ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాడని… ఇక ప్రస్తుతం అటు సినిమా షూటింగ్, ఇటు ఫ్యామిలీతో ఎంజాయ్ రెండు చేస్తూ ఏకకాలంలో రెండిటిని మ్యానేజ్ చేస్తున్న ఈతరం స్టార్ హీరో రామ్ చరణ్ ఒక్కడే…

    ఇక ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న రామ్ చరణ్ ఈ సినిమా షూటింగ్ తొందర్లోనే కంప్లీట్ చేసి సినిమాని రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇది అయిపోయిన వెంటనే బుచ్చిబాబు డైరెక్షన్ లో వచ్చే సినిమా మీద తన ఫోకస్ ని పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది…