
కొన్ని టాపిక్స్ ఎప్పుడూ ట్రెండ్స్ లో ఉంటాయి. కొందరు మాట్లాడుకుంటే కూడా అలాగే ఉంటుంది. ఇండస్ట్రీలో మెగా-నందమూరి ఫ్యామిలీస్ మధ్య రిలేషన్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇలాంటి కాంపౌండ్స్ నుంచి వచ్చిన నట వారసులు ఎన్టీఆర్-రామ్ చరణ్ కలిసి సినిమా ప్రకటించడమే ఓ సెన్సేషన్ అయ్యింది. అప్పటి నుంచి వీరిద్దరికి సంబంధించిన ఏ విషయమైనా.. టాప్ ట్రెండింగ్ లోనే ఉంటోంది. లేటెస్ట్ గా మరో న్యూస్ వచ్చింది. అదే జూనియర్ ఎన్టీఆర్ పొలిటకల్ ఎంట్రీ. ఈ ప్రశ్నలో కొత్తేముందీ.. అనుకున్నారేమో! ప్రశ్న పాతదే.. అడిగిన వ్యక్తే కొత్త. ఈ ప్రశ్న రామ్ చరణ్ అడగడమే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. దీనికి జూనియర్ ఏం సమాధానం చెప్పారన్నది మరింత ఆసక్తికరం.
జూనియర్ – రామ్ చరణ్ ఇద్దరూ మంచి స్నేహితులు. వీరి రిలేషన్ RRRతో మరింతగా బలపడింది. ఇద్దరూ ఒకే సినిమాలో కలిసి నటిస్తుండడం వల్ల.. కలిసి మాట్లాడుకునే సమయం చాలా ఉంటుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య రిలేషన్ పెరగడానికి కావాల్సిది అదే కదా. ఆ టైమ్ వీళ్లకు బాగా కుదిరింది. దీంతో.. అన్ని విషయాలనూ వీరు చర్చించుకుంటున్నారు. షూట్ గ్యాప్ లో వీళ్లు అన్ని విషయాలనూ డిస్కస్ చేసుకుంటారని టాక్.
అయితే.. త్వరలో ప్రసారం కానున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకు జూనియర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ గేమ్ షోకు రామ్ చరణ్ కూడా వచ్చారని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ ఒక క్వశ్చన్ అడుగుతాడట. ‘ఎన్టీఆర్.. పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు’ అన్నదే ఆ ప్రశ్న. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా కాసేపు ఈ విషయమై చర్చ సాగుతుందని ఫీలర్స్ వచ్చాయి.
కానీ.. ఇప్పుడు జూనియర్ మనసు మార్చుకున్నాడట. ప్రస్తుతం ఈ టాపిక్ అవసరం లేదని, కాబట్టి.. ఆ బిట్ వరకు ఎడిట్ లో కట్ చేయాలని నిర్వాహకులకు సూచించాడట. మరి, రామ్ చరణ్ – జూనియర్ మధ్య ఈ డిస్కషన్ జరిగిందా? దాన్ని నిజంగానే ఎడిటింగ్ లో లేపేస్తున్నారా? అన్నది తెలియాలంటే.. ఆ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే వరకూ వెయిట్ చేయాల్సిందే.