Ram Charan : గేమ్ చేంజర్'(Game Changer Movie) వంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్(Ram Charan) బుచ్చి బాబు(Buchi Babu Sana) తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఉన్న అంచనాలు మామూలైవి కావు. ఛాలెంజింగ్ రోల్స్ అంటే రెచ్చిపోయి జీవించే రామ్ చరణ్ కి ఫుల్ లెంగ్త్ ఛాలెంజింగ్ రోల్ పడుతుంది. ఇక ఆకాశమే హద్దు అని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్ నెలలో విడుదల చేయాలని మూవీ టీం ప్లాన్ చేస్తుంది. ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ సుకుమార్ తో ఒక సినిమా చేయబోతున్నాడు అనే విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల కాలం లో సుకుమార్ తరచూ రామ్ చరణ్ ని కలుస్తూ స్టోరీ గురించి చర్చలు జరుపుతున్నాడు.
అయితే గత రెండు మూడు రోజుల నుండి సోషల్ మీడియా లో ప్రచారమయ్యే వార్త ఏమిటంటే, రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని సుకుమార్ తో చేయడం లేదని, బాలీవుడ్ లో కిల్ చిత్రం తో సెన్సేషన్ సృష్టించిన నిఖిల్ నగేష్ భట్ తో కలిసి ఒక మైథాలజీ సబ్జెక్టు మీద సినిమా చేస్తున్నాడని ఒక వార్త వైల్డ్ ఫైర్ లాగ వ్యాప్తి చెందింది. అయితే ఈ వార్త రామ్ చరణ్ వరకు చేరడంతో ఆయన వెంటనే స్పందించి తన టీం ద్వారా అవన్నీ రూమర్స్ మాత్రమేనని, ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం బుచ్చి బాబు సినిమాపై, ఆ తర్వాత సుకుమార్ సినిమాపై మాత్రమే ఉందని, ఈ రెండు సినిమాలు తప్ప రామ్ చరణ్ మరో కథని ఇప్పట్లో వినే అవకాశం లేదని చెప్పుకొచ్చారు. కొంతమంది దర్శకులు రామ్ చరణ్ ని ఈమధ్య కాలం లో కలిసిన విషయం వాస్తవమే.
అందులో నిఖిల్ నగేష్ భట్ కూడా ఒకరు. సందీప్ రెడ్డి వంగ తో కూడా రామ్ చరణ్ ఇటీవలే చర్చలు జరిపాడు. భవిష్యత్తులో ఎలా ముందుకు పోవాలి అనేదానిపై ఒక క్లారిటీ అయితే ఉందట కానీ, కేవలం ఐడియాస్ మాత్రమే వింటున్నది, పూర్తి స్థాయి స్క్రిప్ట్ న్యారేషన్ అయ్యాకనే ఏ సినిమా అయిన అధికారికంగా ఖరారు అవుతుంది. అప్పటి వరకు ఇవన్నీ నమ్మొద్దు అంటూ రామ్ చరణ్ పీఆర్ టీం స్పందించింది. ఇకపోతే ప్రస్తుతం బుచ్చి బాబు తో రామ్ చరణ్ చేస్తున్న చిత్రం కథ, రంగస్థలం కి మించి ఉంటుందని, తన పాత్ర చాలా అద్భుతంగా వచ్చిందని అనేక సందర్భాల్లో రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. కేవలం ఫ్లాష్ బ్యాక్ సన్నివేశం కోసం ఆయన ఏకంగా 10 కిలోల బరువు తగ్గాడట. దీనిని బట్టి చూస్తుంటే రామ్ చరణ్ కసి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.